మద్దిగట్ల–మోజర్ల పాఠశాలలో విద్యార్థులకు దుస్తుల పంపిణీ.
పెద్దమందడి,ఆగస్టు14(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మద్దిగట్ల–మోజర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఉచిత దుస్తుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మద్దిగట్ల, మోజర్ల సర్పంచులు రాములు యాదవ్, చంద్రశేఖర్ చేతుల మీదుగా విద్యార్థులకు దుస్తులను పంపిణీ చేశారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచిత దుస్తులు అందించడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. స్వాతంత్ర్య దినోత్సవం నాటికి విద్యార్థులకు దుస్తులు అందించాలనే ఉద్దేశంతో పాఠశాలలకు ప్రభుత్వం దుస్తులను అందజేసిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు వరప్రసాద్ రావు తెలిపారు.ఈ సందర్భంగా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఎస్. వరప్రసాద్ రావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రభుత్వం అనేక సదుపాయాలు కల్పిస్తోందన్నారు. ఉచిత పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, డిజిటల్ తరగతుల ద్వారా బోధన వంటి పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.మద్దిగట్ల సర్పంచ్ రాములు యాదవ్ మాట్లాడుతూ.. విద్యార్థులకు ఏవైనా సమస్యలు ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. మోజర్ల సర్పంచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత దుస్తులు అందించడం అభినందనీయమన్నారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు ఎంతగానో దోహదపడుతున్నాయని పేర్కొన్నారు.అనంతరం విద్యార్థులందరికీ ఉచిత దుస్తులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మోజర్ల ఉపసర్పంచ్ రాముల యాదవ్, వార్డు సభ్యులు సింగం కృష్ణయ్య, శివ, బాలకృష్ణ, పాఠశాల ఉపాధ్యాయులు పి. వెంకటస్వామి, గద్వాల కృష్ణయ్య, వాణి ప్రభ, పుల్లయ్య, కే. మధుసూదన్, ఎన్. వెంకటస్వామి, ఏ. వెంకటస్వామి, శ్రీనివాసులు, టీ.కే. ప్రవీణ్ కుమార్, చిన్నారెడ్డి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.


Comments