హర్గర్ తిరంగా హర్గర్ తిరంగా ప్రతి ఇంటి మీద జెండా ఎగర వెయ్యాలి.

జాతీయ ఐక్యత సమగ్రతను కాపాడుదాం.

హర్గర్ తిరంగా హర్గర్ తిరంగా ప్రతి ఇంటి మీద జెండా ఎగర వెయ్యాలి.

కాప్రా, ఆగస్టు 12 (తెలంగాణ ముచ్చట్లు):

దేశ 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు పిలుపు మేరకు కాప్రా వంపుగూడలో ఘనంగా నిర్వహించారు.
వంపుగూడకు చెందిన బీజేపీ నాయకుడు నిశాంత్ తన నివాసంతో పాటు స్థానిక కాలనీలోని పలు ఇళ్లపై జాతీయ జెండాలను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని దేశభక్తి నినాదాలతో సందడి చేశారు. చిన్నారుల చేతుల్లో త్రివర్ణ పతాకాలు రెపరెపలాడుతూ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా నిశాంత్ మాట్లాడుతూ, ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం ద్వారా దేశభక్తిని, జాతీయ గర్వాన్ని చాటాలని పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ జాతీయ ఐక్యత, సమగ్రతను కాపాడేందుకు ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు.
దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల త్యాగాలను రాబోయే తరాలకు తెలియజేసి, వారిలో దేశభక్తి భావాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపును ప్రతి ఒక్కరూ స్వీకరించి ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ కార్యకర్తలు, మహిళలు, యువకులు పాల్గొని జాతీయ గీతాన్ని ఆలపించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News