దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి.
పారా–3 రద్దు చేయాలని డిమాండ్.. వనపర్తిలో బ్లాక్ డే ర్యాలీ.
వనపర్తి,ఆగస్టు10(తెలంగాణ ముచ్చట్లు):
1950 రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని పారా–3ను రద్దు చేసి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ రాజ్యాంగ హక్కుల సాధన సమితి వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం బ్లాక్ డే నిర్వహించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి రాజీవ్ చౌక్ నుంచి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చౌరస్తా వరకు నిరసన ర్యాలీ నిర్వహించి, అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.కార్యక్రమానికి జిల్లా కోఆర్డినేటర్ గొర్ల కృష్ణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కొమ్ము చెన్నకేశవులు మాదిగ, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు గంధం భగత్, సీపీఎం జిల్లా అధ్యక్షుడు పుట్ట ఆంజనేయులు, సామాజిక నేత గంధం నాగరాజు మాట్లాడుతూ.. పారా–3 దళిత క్రైస్తవుల రాజ్యాంగ హక్కులకు అడ్డంకిగా ఉందన్నారు. సిక్కు, బౌద్ధ దళితులకు ఎస్సీ హోదా కల్పించిన విధంగానే దళిత క్రైస్తవులకు కూడా ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. హక్కులు సాధించే వరకు ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమం కొనసాగిస్తామని తెలిపారు.కార్యక్రమంలో జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె. థామస్ బెంజమిన్, పాస్టర్ డేవిడ్ ఇమ్మానియేల్, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు విశ్వం బాబు, డీఎస్పీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, సీపీఐ జిల్లా అధ్యక్షుడు రమేష్, వార్డు కౌన్సిలర్ మదన్, భారత్ సేవా టీం బాల గోవింద్, కేఎన్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు వీరపోగు గోవింద్, ఐద్వా అధ్యక్షురాలు లక్ష్మీ, యాకోబు విజయకుమార్, ఏ. రంజిత్, పి. భాస్కర్, ప్రసాద్, పాస్టర్ లాజర్స్, యుగేందర్, వేణు జనార్దన్, మనోహర్, అమర్, పాస్టర్ అనిల్ కుమార్, గొర్ల అనిల్ కుమార్, కె.జె.ఎస్. సామేలు, గంధం పరంజ్యోతి, రంగస్వామి, మన్మోహన్, రవి, శ్రీను, అజయ్ మాదిగ, చెన్నయ్య మాదిగ, వేదాంత్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో క్రిస్టియన్ పాస్టర్లు, దళిత క్రైస్తవులు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.


Comments