రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు సాయి గణేష్ ఎంపిక.

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు సాయి గణేష్ ఎంపిక.

వనపర్తి,ఆగస్టు05(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లాలో నేషనల్ జావెలిన్ డే సందర్భంగా నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం మోజర్ల ఉద్యాన కళాశాల విద్యార్థి సాయి గణేష్ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.డాక్టర్ బాలకిష్టయ్య క్రీడా ప్రాంగణంలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలలో అండర్–20 జావెలిన్ విభాగంలో పాల్గొన్న సాయి గణేష్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచాడు. ఈ విజయంతో తెలంగాణ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొనే అర్హత సాధించాడు.ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన సాయి గణేష్‌ను కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వీణా జోషి ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం కళాశాలకు గర్వకారణమని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి పోటీలలోనూ ఉత్తమ ప్రతిభ కనబరిచి కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.హనుమకొండ జిల్లా జేఎన్ గ్రౌండ్స్‌లో ఈనెల 7, 8 తేదీలలో జరగనున్న రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో సాయి గణేష్ పాల్గొంటారని తెలిపారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడలకు కూడా తమ దినచర్యలో కొంత సమయం కేటాయించాలని సూచించారు. ప్రతిరోజూ వ్యాయామం చేయడం ద్వారా శారీరక దృఢత్వంతోపాటు మానసిక ఉల్లాసం పెరుగుతుందని పేర్కొన్నారు. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదల వంటి లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు.కార్యక్రమంలో ఓఎస్‌ఏ రాజశేఖర్, డాక్టర్ షహనాజ్, ఫిజికల్ డైరెక్టర్ మహేష్, అధ్యాపక బృందం పాల్గొని సాయి గణేష్‌ను అభినందించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి.. బీఆర్ఎస్‌కు పెరుగుతున్న ఆదరణ: కౌశిక్ రెడ్డి. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి.. బీఆర్ఎస్‌కు పెరుగుతున్న ఆదరణ: కౌశిక్ రెడ్డి.
*పక్క చూపులు చూసేవారు పార్టీని వీడొచ్చు.. బీఆర్ఎస్ శ్రేణులకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హెచ్చరిక* హుజూరాబాద్, ఆగస్టు 5 (తెలంగాణ ముచ్చట్లు): ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి...
వనపర్తి ప్రెస్‌క్లబ్ నిర్మాణానికి రూ.20 లక్షలు.
ఎల్‌నినో ప్రభావం.. రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించాలి .
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు సాయి గణేష్ ఎంపిక.
వేలేరులో ప్రజాప్రతినిధులు–అధికారుల సమన్వయ, సమీక్ష సమావేశం.
ప్రమాదకరంగా మారిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్.
ప్రకృతిని ప్రేమించడం ఒక కళ.