పదవి విరమణ పొందిన ఉద్యోగులను సన్మానించిన జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్.

పదవి విరమణ పొందిన ఉద్యోగులను సన్మానించిన జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్.

ఖమ్మం బ్యూరో , ఆగస్టు 03(తెలంగాణ ముచ్చట్లు )

దీర్ఘకాలంగా ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించి పదవీ విరమణ పొందిన ఉద్యోగులను జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ఘనంగా సన్మానించారు.

సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జూలై 31 నాటికి పదవి విరమణ పొందిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ  కార్యక్రమంలో  జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్, అదనపు కలెక్టర్ లు డాక్టర్ పి.శ్రీజ, పి. శ్రీనివాస్ రెడ్డి లు ముఖ్య అతిథులుగా హాజరై ఉద్యోగుల సేవలను కొనియాడారు.

మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ లో అసిస్టెంట్ సిడిపిఓ గా పని చేస్తున్న జే.రత్నకుమారి,  జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయ డ్రైవర్ సి.హెచ్. నాగరాజు పదవి విరమణ వేడుకలు బాగా జరిగాయి. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ  సుమారు 30 నుంచి 35 సంవత్సరాల పాటు ప్రజా సేవలో నిర్విరామంగా సేవలు అందించి నేడు పదవి విరమణ పొందుతున్న అధికారులకు , సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.  పదవీ విరమణ తర్వాత వారు జీవితం ప్రశాంతంగా, ఆరోగ్యవంతంగా జీవించాలని కలెక్టర్ ఆకాంక్షించారు.

అనంతరం జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు పదవి విరమణ పొందిన వారినీ ఘనంగా సన్మానించారు. 

ఈ కార్యక్రమంలో ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ పరాస్ కుమార్, డిఆర్ఓ సిహెచ్ రామ్మూర్తి, డిడబ్ల్యుఓ ఏ.ప్రమీల, జిల్లా ఉపాధి అధికారి ఎన్. మాధవి, జిల్లా అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, పదవి విరమణ పొందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఖమ్మం జిల్లాలో జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల జారీని వేగవంతం చేయాలి.  ఖమ్మం జిల్లాలో జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల జారీని వేగవంతం చేయాలి. 
జిల్లా కలెక్టర్‌కు గ్రీవెన్స్ లో టిడబ్ల్యూజేఎఫ్ (హెచ్- 2843) వినతి. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నానబాల రామకృష్ణ,అర్వపల్లి నగేష్. ఖమ్మం బ్యూరో , ఆగస్టు 3(తెలంగాణ ముచ్చట్లు...
శ్రీనన్న ఆత్మీయ భరోసా..ప్రతి పేద కుటుంబ నమ్మకానికి ప్రతిక.
తెలంగాణ సాహితీ సంఘంలో గీతాకుమారికి స్థానం.
వేణుకుమార్ కుటుంబానికి నామ ట్రస్ట్ ద్వారా రూ.50 వేల ఆర్థిక సాయం.
బాధితులకు కొండంత అండగా పీఎస్ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్.
కాకర్లపల్లి పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి.
బాధితులకు కొండంత అండగా పీఎస్ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్.