పెద్దమందడి శివాలయానికి పునర్వైభవం.

పెద్దమందడి శివాలయానికి పునర్వైభవం.

పెద్దమందడి,ఆగస్టు02(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి గ్రామంలోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలో ఉన్న శివాలయానికి పునర్వైభవం తీసుకొచ్చే దిశగా పునర్నిర్మాణ పనులు చేపడుతున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు పల్లె సత్యనారాయణ తెలిపారు. శివాలయ పునర్నిర్మాణానికి దాదాపు రూ.60 లక్షల వ్యయం అవుతుందని అంచనా వేసినట్లు పేర్కొన్నారు. భక్తులు, దాతలు, గ్రామ ప్రజలు అందించే విరాళాలు, సహకారంతో శివాలయ నిర్మాణ పనులను చేపడతామని తెలిపారు.శివాలయ ప్రాచీన వైభవం, ఆధ్యాత్మిక విశిష్టతను కాపాడుతూ సంప్రదాయ ఆలయ నిర్మాణ శైలికి అనుగుణంగా రాతితో పునరుద్ధరణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఆలయాన్ని మరింత సుందరంగా, భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించేలా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.శివాలయ పునర్నిర్మాణం మహత్తర పుణ్యకార్యమని, ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామ ప్రజలు, దాతలు తమవంతు విరాళాలు, సహాయ సహకారాలు అందించి భాగస్వాములు కావాలని పల్లె సత్యనారాయణ కోరారు. అందరి సహకారంతో పునర్నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి శివాలయానికి పూర్వవైభవం తీసుకురావడమే లక్ష్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పరామర్శలతో ప్రజలకు అండగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. పరామర్శలతో ప్రజలకు అండగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.
  బాధిత కుటుంబాలకు ఓదార్పు – ప్రతి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా హుజురాబాద్,ఆగష్టు 2(తెలంగాణ ముచ్చట్లు ): హుజురాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
హుజురాబాద్ సభలో రావుల వేణుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కితాబు.
స్నేహ బంధానికి ప్రపంచం వందనం.
వేంసూరు టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం.
జర్నలిస్టులకు అండగా ఉంటా: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.
ఖమ్మం–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే అందుబాటులోకి.
భూ వివాదం ఉద్రిక్తం.. దంపతులపై దాడి జరిగిందని ఆరోపణ.