వెల్టూర్‌లో ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు.
పెద్దమందడి,జులై(31తెలంగాణ ముచ్చట్లు)
వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆదేశాల మేరకు వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామపంచాయతీ భవనంలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం పరిశీలించారు. పెద్దమందడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొమ్ము వెంకటస్వామి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు గ్రామపంచాయతీ భవనానికి చేరుకుని, ఎస్‌ఐఆర్ ప్రక్రియ పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొమ్ము వెంకటస్వామి మాట్లాడుతూ.. వెల్టూర్ గ్రామంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ ఇప్పటికే 99 శాతం పూర్తయిందని తెలిపారు. మిగిలిన ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి, 100 శాతం లక్ష్యాన్ని సాధించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.మిగిలిన ప్రక్రియను కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కోరారు.ఈ కార్యక్రమంలో వనపర్తి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, మండల అధ్యక్షుడు కొమ్ము వెంకటస్వామి, గ్రామ అధ్యక్షుడు ప్రేమ్ సాగర్, గ్రామ మాజీ అధ్యక్షుడు బాబు రెడ్డి, గట్టు యాదవ్, మాజీ సర్పంచ్ బాలచంద్రయ్య, మాజీ ఉపసర్పంచ్ మల్లికార్జున్, వడ్డె శేఖర్, వార్డు సభ్యులు నాగభూషణ్ ,బీఎల్ఏలు దిండు రవీందర్ ,మద్దూర్ నరసింహ,నవీన్,మద్దూరు వెంకటయ్య, గుండెల ఆంజనేయులు, దిండు వివేక్, కుమ్మరి కొండన్న రామచంద్రయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Comments