పెద్దమందడిలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ 89 శాతం పూర్తి.

పెద్దమందడి తహసీల్దార్ మల్లికార్జున్.

పెద్దమందడిలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ 89 శాతం పూర్తి.

పెద్దమందడి,జూలై29(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలంలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ 89 శాతం పూర్తయిందని తహసీల్దార్ మల్లికార్జున్ తెలిపారు. ఇంకా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను పూర్తి చేసుకోని వారు త్వరగా పూర్తి చేసుకోవాలని ఆయన కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మండలంలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేందుకు అధికారులు, సంబంధిత సిబ్బంది కృషి చేస్తున్నారని తెలిపారు. డబుల్‌ ఓట్లు కలిగిన వారి వివరాలను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీలించి, నిబంధనల మేరకు తొలగించడం జరుగుతుందని పేర్కొన్నారు.మిగిలిన వారు సకాలంలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను పూర్తి చేసుకునేలా సహకరించాలని కోరారు. త్వరలోనే మండలంలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను 100 శాతం పూర్తి చేస్తామని తహసీల్దార్ మల్లికార్జున్ ధీమా వ్యక్తం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

వ్యవసాయ పనుల్లో విషాదం.. ట్రాక్టర్ బోల్తాపడి రైతు మృతి. వ్యవసాయ పనుల్లో విషాదం.. ట్రాక్టర్ బోల్తాపడి రైతు మృతి.
జమ్మికుంట రూరల్ జూలై 29 (తెలంగాణ ముచ్చట్లు): జమ్మికుంట మండలంలోని అంకుశాపూర్ గ్రామంలో వ్యవసాయ పనులు చేస్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడటంతో ఓ రైతు మృతిచెందిన విషాద...
గడువులోగా ఎస్ ఐ ఆర్ ప్రక్రియను 100 శాతం పూర్తి చేయాలి.
నామ తల్లిదండ్రుల స్మృతి వనాన్ని సందర్శించిన లెఫ్టినెంట్ గవర్నర్.
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు : మంత్రి పొంగులేటి.
విద్యార్థుల భవిష్యత్తే రాష్ట్రానికి అసలైన పెట్టుబడి : మంత్రి పొంగులేటి.
బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు ఎన్నికైన ఉదయ్ నాగరాజుకు ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి సత్కారం.
రాహుల్ గాంధీపై పొంగులేటి సుధాకర్ రెడ్డి వ్యాఖ్యలు.