ఓటరు జాబితా సవరణ వేగవంతం చేయాలి.
మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.
పెద్దమందడి,జూలై25(తెలంగాణ ముచ్చట్లు):
అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కు పరిరక్షించాల్సిన బాధ్యత బీఆర్‌ఎస్ నాయకులు, బీఎల్‌ఏలపై ఉందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శనివారం పెద్దమందడి మండలంలోని బుగ్గపల్లి తండా, అమ్మపల్లి, అమ్మపల్లి తండా గ్రామాల్లో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా బీఎల్‌వోలు, బీఎల్‌ఏలతో మాట్లాడిన ఆయన, సమయం తక్కువగా ఉన్నందున ఇంటింటికి వెళ్లి అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు తుది జాబితాలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో బీఎల్‌వోల నుంచి సవరణ ప్రక్రియ పురోగతిని తెలుసుకున్నారు.కొన్ని బూత్‌లలో ఓటర్ల సంఖ్య అధికంగా ఉండటంతో బీఎల్‌వోలపై పనిభారం పెరిగిందని, అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి సకాలంలో ఓటరు జాబితా సవరణ పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా రైతుబంధు మాజీ అధ్యక్షుడు జగదీశ్వర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ రఘుపతి రెడ్డి, మనిగిల్ల సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్, మాజీ సింగిల్ విండో ఉపాధ్యక్షుడు కుమార్ యాదవ్, చిన్న రఘు, సేనాపతి పురుషోత్తం రెడ్డి, రామేశ్వర్ రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు బందనా, చందు, బస్వరాజు, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.


Comments