ఉపసర్పంచుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా రాయికంటి రాములు యాదవ్.
వనపర్తి,జూలై24(తెలంగాణ ముచ్చట్లు);
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మోజర్ల గ్రామ ఉపసర్పంచ్ రాయికంటి రాములు యాదవ్‌కు వనపర్తి జిల్లా ఉపసర్పంచుల సంఘం జిల్లా ఉపాధ్యక్ష పదవిని అప్పగించారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.నూతనంగా బాధ్యతలు చేపట్టిన రాయికంటి రాములు యాదవ్‌కు ఉపసర్పంచులు, గ్రామ పెద్దలు, నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలోని ఉపసర్పంచుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, వారి హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా రాయికంటి రాములు యాదవ్ మాట్లాడుతూ.. తనపై విశ్వాసం ఉంచి జిల్లా ఉపాధ్యక్షుడిగా అవకాశం కల్పించిన సంఘం నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఉపసర్పంచుల ఐక్యతను బలోపేతం చేయడం, వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని, సంఘం ఆశయాలకు అనుగుణంగా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని తెలిపారు.


Comments