తరగతి గది నుంచి విజ్ఞాన లోకంలోకి… 

జిల్లా సైన్స్ మ్యూజియంలో శ్రీ గ్లోబల్ హైస్కూల్ విద్యార్థుల విద్యా విహారం.

తరగతి గది నుంచి విజ్ఞాన లోకంలోకి… 

ఖమ్మం బ్యూరో, జులై 23,(తెలంగాణ ముచ్చట్లు )

విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించి, పుస్తకాలలోని సిద్ధాంతాలకు ఆచరణాత్మక అనుభవాన్ని జోడించే లక్ష్యంతో శ్రీ గ్లోబల్ హైస్కూల్ విద్యార్థులు జిల్లా సైన్స్ మ్యూజిIMG-20260722-WA0035యాన్ని సందర్శించారు. ఈ విద్యా విహారం విద్యార్థులకు కొత్త అనుభూతిని కలిగించడమే కాకుండా విజ్ఞానంపై మరింత ఆసక్తిని పెంచింది. తరగతి గది నాలుగు గోడల మధ్య పాఠాలు నేర్చుకునే విద్యార్థులు, నేరుగా విజ్ఞాన ప్రపంచంలోకి అడుగుపెట్టి సైన్స్ అద్భుతాలను స్వయంగా పరిశీలించి ఆనందించారు. మ్యూజియంలో ఏర్పాటు చేసిన శాస్త్రీయ నమూనాలు, ప్రయోగాలు, విజ్ఞాన ప్రదర్శనలు వారిని విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా జిల్లా సైన్స్ మ్యూజియం ఇన్‌చార్జ్ డీఎస్‌ఓ ఈ. వెంకటేశ్వర్లు విద్యార్థులతో ప్రత్యేకంగా ముచ్చటించి, మ్యూజియంలోని వివిధ శాస్త్ర నమూనాల పనితీరు, వాటి వెనుక ఉన్న శాస్త్రీయ సూత్రాలను సరళంగా వివరించారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ విజ్ఞానాన్ని ఆసక్తికరంగా అందించారు.
మ్యూజియంలో విద్యార్థులు ముఖ్యంగా మానవ కన్ను (హ్యూమన్ హై) నిర్మాణం, ఉత్తల , అవతల అద్దాల పనితీరు, బ్లాక్ హోల్ ,భావన, బెర్నౌలి సూత్రం , అలాగే గతిశక్తి  మరియు స్థితిశక్తి  వంటి శాస్త్రీయ అంశాలను ప్రత్యక్ష నమూనాల ద్వారా తెలుసుకున్నారు.
ఈ విద్యా పర్యటనలో పాఠశాల ఫిజికల్ సైన్స్, బయాలజీ ఉపాధ్యాయులు విద్యార్థులకు వివిధ నమూనాలపై అవగాహన కల్పించారు. ఈ విద్యా విహారం ద్వారా విద్యార్థుల్లో పరిశీలనా నైపుణ్యం, శాస్త్రీయ ఆలోచనా విధానం, విజ్ఞానంపై ఆసక్తి మరింత పెరిగిందని పాఠశాల యాజమాన్యం అయినా ఇనుకుల్ల దివాకర్ రెడ్డి, వాహిని, సుధాకర్ రెడ్డి, తిరుపతి రెడ్డి మరియు పాఠశాల ప్రిన్సిపల్ తన్నీరు రామారావు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తెలపడం జరిగింది. విద్యార్థులు కూడా ఈ పర్యటన తమకు మరపురాని అనుభవంగా నిలిచిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఫిజికల్ సైన్స్ మరియు బయాలజికల్ సైన్స్ ఉపాధ్యాయులు అయిన ఎస్. పవన్ కుమార్, ఎన్, కృష్ణ మరియు సలీం మొదలగు వారు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News