నిరుద్యోగులకు శుభవార్త.. డిగ్రీ కళాశాలలో ఉద్యోగావకాశం.
జూలై 24 వరకు దరఖాస్తుల స్వీకరణ.. 27న డెమో, ఇంటర్వ్యూలు.
హుజురాబాద్, జూలై 21(తెలంగాణ ముచ్చట్లు ):
హుజురాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కళాశాలలో ఖాళీగా ఉన్న నాలుగు గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిరాదేవి తెలిపారు.
ఆసక్తి గల అభ్యర్థులు జూలై 24 సాయంత్రం 4 గంటలలోపు తమ దరఖాస్తులను ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సమర్పించాలని సూచించారు. అనంతరం జూలై 27 ఉదయం 11 గంటలకు డెమో తరగతులు, ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులను ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు.
అభ్యర్థులు సంబంధిత విద్యార్హత సర్టిఫికెట్లు, మార్కుల మెమోలు, ఇతర అవసరమైన ఒరిజినల్ ధ్రువపత్రాలతో ఇంటర్వ్యూకు హాజరుకావాలని సూచించారు. NET, SET, PhD అర్హతలు కలిగిన వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు.
ఉన్నత విద్యార్హతలు కలిగిన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని కళాశాల యాజమాన్యం కోరింది. గెస్ట్ ఫ్యాకల్టీ నియామక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి, ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు.


Comments