ఎల్‌నినో కమిటీ ఛైర్మన్‌గా నియామకం.. డా. జి. చిన్నారెడ్డికి ఘన సన్మానం.
Views: 0
On
వనపర్తి,జూలై21(తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌నినో కమిటీ ఛైర్మన్‌గా డా. జి. చిన్నారెడ్డిని నియమించిన సందర్భంగా వనపర్తి జిల్లా వికలాంగుల కమిటీ అధ్యక్షుడు గంజాయి రమేష్ ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా గంజాయి రమేష్ మాట్లాడుతూ, డా. జి. చిన్నారెడ్డికి ప్రభుత్వం అప్పగించిన ఈ బాధ్యత ఎంతో కీలకమైనదని అన్నారు. ప్రజా సమస్యలపై అవగాహన, పరిపాలనా అనుభవంతో ఆయన కమిటీ లక్ష్యాలను సమర్థవంతంగా అమలు చేస్తారనే నమ్మకం వ్యక్తం చేశారు. నూతన బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించి ప్రజలకు మరింత చేరువవుతారని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా మాజీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఎం. దేవన్న యాదవ్, మాజీ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మున్నూరు జయకర్, అజీమ్, వీరయ్యపల్లి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
22 Jul 2026 22:00:31
హుజురాబాద్, జూలై 22(తెలంగాణ ముచ్చట్లు ):
హుజురాబాద్ ప్రాంత ప్రజలకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన శాఖను...


Comments