వర్షాకాలంలో కలుషిత నీటికి అడ్డుకట్ట వేయాలి.

వాటర్ సప్లై సిబ్బందికి మున్సిపల్ చైర్మన్ ఆదేశాలు.

వర్షాకాలంలో కలుషిత నీటికి అడ్డుకట్ట వేయాలి.

జమ్మికుంట టౌన్ జూలై 22 (తెలంగాణ ముచ్చట్లు):

వర్షాకాలంలో ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని జమ్మికుంట మున్సిపల్ వాటర్ సప్లై సిబ్బందికి మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ సూచించారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన వాటర్ సప్లై సిబ్బంది సమావేశంలో ఆయన మాట్లాడారు.
పట్టణంలోని 30 వార్డుల్లో తాగునీటి పైప్‌లైన్లను క్షేత్రస్థాయిలో పూర్తిగా పరిశీలించి, ఎక్కడైనా లీకేజీలు ఉన్నట్లయితే వెంటనే గుర్తించి మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. వర్షాకాలంలో పైప్‌లైన్ లీకేజీల కారణంగా కలుషిత నీరు సరఫరా అయ్యే ప్రమాదం ఉందని, దీనివల్ల ప్రజలు నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల బారిన పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా, ప్రతి వార్డుకు నాణ్యమైన తాగునీరు అందేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని చైర్మన్ కోరారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆయన స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి, మేనేజర్ జి. రాజిరెడ్డి, వాటర్ సప్లై సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News