రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ వనపర్తిలో కాంగ్రెస్ భారీ ఆందోళన.

రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ వనపర్తిలో కాంగ్రెస్ భారీ ఆందోళన.

వనపర్తి,జూలై22(తెలంగాణ ముచ్చట్లు):

లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ), తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) పిలుపు మేరకు బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్‌లో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.రాజకీయ కక్షసాధింపుతో ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ, ప్రజాస్వామ్యంలో విభిన్న అభిప్రాయాలను అణచివేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. ప్రజల సమస్యలపై పోరాడుతున్న రాహుల్ గాంధీని భయపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. అనంతరం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వనపర్తి రాజీవ్ చౌరస్తాలో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తిరుపతయ్య, బ్రహ్మం చారి, మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు కదిరే రాములు, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వాకిటి ఆదిత్య, మార్కెట్ యార్డ్ మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, పెద్దమందడి మండలాధ్యక్షుడు వెంకటస్వామి, గోపాల్పేట మండలాధ్యక్షుడు నరహరి, కౌన్సిలర్లు, మైనార్టీ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News