15 రోజుల్లో అర్హులందరికీ అక్రిడిటేషన్ లు.

15 రోజుల్లో అర్హులందరికీ అక్రిడిటేషన్ లు.

టీడబ్ల్యూజేఎఫ్ వినతిపై ఖమ్మం జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర స్పందన

◆ ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, రాష్ట్రస్థాయి బస్ పాస్ లు, ఇతర సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా...

◆ జర్నలిస్టుల సమస్యలపై కలెక్టరేట్ ఎదుట టీడబ్ల్యూజేఎఫ్ భారీ ఆందోళన

◆ 15న హైదరాబాద్ సమాచార భవన్ ఎదుట ఆందోళనకు తరలి రావాలి 

◆ టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఖదీర్, శ్రీనివాసరెడ్డి


ఖమ్మం బ్యూరో , జూలై 13(తెలంగాణ ముచ్చట్లు )

పెండింగ్ లో ఉన్న అక్రిడిటేషన్ లు 15 రోజుల్లో ఇస్తామని టీడబ్ల్యూజేఎఫ్ నేతలకు జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర హామీ ఇచ్చారు. ఈ మేరకు జిల్లా సమాచారశాఖ అధికారికి ఆదేశాలు జారీచేశారు. ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, ఇతర జర్నలిస్టు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్ - 2843) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ ముందు సోమవారం వందమందికి పైగా జర్నలిస్టులు గంటసేపు భారీ ఆందోళన నిర్వహించారు. 

--- జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించే వరకూ పోరాటం ఆగదు : టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఖదీర్, శ్రీనివాసరెడ్డి

జర్నలిస్టుల సమస్యలన్నీ పరిష్కరించే వరకూ పోరాటం నిర్వహిస్తామని టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సయ్యద్ ఖదీర్, కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి లు తెలిపారు. 15న హైదరాబాద్ లోని సమాచార శాఖ కమిషనరేట్ వద్ద నిర్వహించే ఆందోళనకు ఖమ్మం జిల్లా జర్నలిస్టులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారిదిగా ఉంటూ ప్రభుత్వం ఏర్పాటులోనూ, ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాల అమలులోనూ జర్నలిస్టులు క్రియాశీలకంగా పని చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ పనితీరుకు తగ్గట్టుగా రాత్రనకా,  పగలనకా నిరంతరాయంగా పనిచేస్తున్న జర్నలిస్టులు నేడు చాలీచాలని వేతనాలతో.. ఆర్థిక ఇబ్బందుల నడుమ కిరాయి ఇండ్లలో జీవనం కొనసాగిస్తున్న జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తామని ప్రభుత్వాలు హామీలు ఇస్తున్నాయే తప్ప.. ఆచరణలో పెట్టడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో జర్నలిస్టులకూ హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్త ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతోపాటు రైల్వే పాసులను పునరుద్ధరించాలని కోరారు. జర్నలిస్టులకు సరిపడా అక్రిడిటేషన్ల ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం వివిధ సర్టిఫికెట్ల పేరుతో రకరకాల కొర్రీలు పెట్టుతుండడం వల్ల పనిచేస్తున్న అనేకమంది జర్నలిస్టులు అక్రిడిటేషన్ లు పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రాలు, నియోజకవర్గం, మున్సిపల్ సెంటర్లలో పని చేస్తున్న రిపోర్టర్లందరికీ అక్రిడిటేషన్ లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సమస్యలపై జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షులు దువ్వాసాగర్, సహాయ కార్యదర్శి కొత్త యాకేష్, టీబీజేఏ జిల్లా ప్రధాన కార్యదర్శి మానుకొండ రవికిరణ్, సీనియర్ నాయకులు పారుపల్లి కృష్ణారావు, స్టేట్, జిల్లా కమిటీ సభ్యులు చీనేని బాలకృష్ణ, సంతోష్ చక్రవర్తి, నలుబోల మధుశ్రీ, షేక్ జానీపాషా, గరిడేపల్లి వెంకటేశ్వర్లు, కొరకొప్పుల రాంబాబు, గణేష్, గంగాధర్, నాగిరెడ్డి, అంజయ్య, బంకా వెంకటేశ్వర్లు, నాయకులు యాస లక్ష్మారెడ్డి, బండి కుమార్, పత్తి శ్రీనివాస్, అంజద్, శరత్, అర్షద్, గోపీ కృష్ణ, అశోక్ రెడ్డి, వీసారపు అంజయ్య, ఉపేందర్, కె.కిరణ్, గోపీ, షకీల్, సునీత, నాగలక్ష్మి, చంద్రశేఖర్, ధనాలకోట రవికుమార్, జావీద్, వీరారెడ్డి, వెంకటేశ్వర్లు, నారాయణ, తదితరులు పాల్గొన్నారు.IMG-20260713-WA0045

Tags:

Post Your Comments

Comments

Latest News

27న తెలంగాణ జర్నలిస్టుల "ఛలో పార్లమెంట్". 27న తెలంగాణ జర్నలిస్టుల "ఛలో పార్లమెంట్".
ఖమ్మం బ్యూరో,జూలై 11(తెలంగాణ ముచ్చట్లు ) ఖమ్మంకేంద్ర ప్రభుత్వం పరిష్కరించాల్సిన జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ, ఈ నెల 27వ తేదీన "తెలంగాణ జర్నలిస్టుల ఛలో...
15 రోజుల్లో అర్హులందరికీ అక్రిడిటేషన్ లు.
దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి... 
కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా..? అధికారుల వైఫల్యమా..? ఎన్ హెచ్ 765డి జి పై ప్రశ్నల వర్షం.
ఎస్‌ఐఆర్ ప్రక్రియను గ్రామంలో వేగవంతంగా పూర్తి చేయాలి.
వెల్టూర్‌లో ఓటర్ నమోదు సవరణలపై అవగాహన.
ఆరోగ్యవంతమైన బాల్యానికి నులిపురుగుల నివారణ కీలకం.