ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం .

ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం .
అంతర్జాతీయ యోగా సందర్భంగా నిర్వహించిన కార్యక్రమం లో పాల్గొన్న సభ్యులు

కాజీపేట్ జూన్ 21 (తెలంగాణ ముచ్చట్లు)

కాజిపేట్ జంక్షన్ పరిధిలోని డీజిల్ కాలనీ లోనీ రైల్వేఇనిస్ట్యూట్ ఆధ్వర్యంలో 12వ అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డి. ఎం. ఈ. అనికేత్ ఖడే హాజరయ్యారు. ఈ సందర్భంగా అనికేత్ ఖడే మాట్లాడుతూ యోగ భారత దేశ సంస్కృతిక వారసత్వానికి ఒక గొప్ప వరమని ప్రతి ఒక్కరు యోగాను అలవాటు చేసుకోవాలని ఆయన కోరారు మన దైనందిన జీవన శైలిలో ప్రతి ఒక్కరూ యోగ, ధ్యానం అలవాటు చేసుకోవాలని ఆయన తెలిపారు. ప్రతిరోజు యోగా చేయడం వల్ల శరీర దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు యోగ సాధన తో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని ఆయన తెలిపారు యోగ ద్వారా శరీరంలోని ప్రతి అవయానికి ప్రయోజనం కలుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఏ.డి ఎం1.  బి శ్రీనివాసరావు , ఏ డి ఎం 2 వి ఆర్ రాజు,  ఏ సి ఎం టి మల్లికార్జున రావు ,ఈ ఎఫ్ అమలారావు, ఎల్ ఎఫ్ రాజశేఖర్ ,ఓఎస్ సురేష్, డిజిల్ ఇన్స్టిట్యూట్ కమిటీ సభ్యులు రాముల సదానందం, భాస్కర్ రెడ్డి, శంకర్, అక్బర్ పాషా, నరసయ్య, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సెంటర్ యోగ గురువు శోభ, గోపిక, శశిరేఖ, డిజిల్ లోకో షెడ్ సూపర్వైజర్ లతో పాటు ఉద్యోగులు లోకో పైలట్, రిటైర్ ఎంప్లాయిస్, ఇన్స్టిట్యూట్ బాయ్స్, వాకర్స్ లు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

అధికారుల నిర్లక్ష్యానికి మూల్యం.. రూ.90 వేల మేకలు దొంగల పాలయ్యాయి. అధికారుల నిర్లక్ష్యానికి మూల్యం.. రూ.90 వేల మేకలు దొంగల పాలయ్యాయి.
అధికారుల నిర్లక్ష్యానికి మూల్యం.. రూ.90 వేల మేకలు దొంగల పాలయ్యాయి పనిచేయని సీసీ కెమెరాలే దొంగలకు అండా..? వేలేరు, జూన్ 21 (తెలంగాణ ముచ్చట్లు): వేలేరు మండలం...
అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించిన బీజేపీ నాయకులు.
మృతుడి పిల్లల చదువులకు చేయూత.. రూ.1.36 లక్షల విద్యా సహాయ నిధి అందజేత.
ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం .
రైతాంగాన్ని మోసం చేస్తున్న కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదు.
సత్తుపల్లిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి తుమ్మల.
పామాయిల్‌తో రైతు కుటుంబాల్లో వెలుగులు.