అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించిన బీజేపీ నాయకులు.

అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించిన బీజేపీ నాయకులు.

- యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలని పిలుపు.

-  ప్రధాని మోదీ సేవలను కొనియాడిన నేతలు.

జమ్మికుంట టౌన్ జూన్ 21(తెలంగాణ ముచ్చట్లు):

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జమ్మికుంట పట్టణంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు కొలకాని రాజు ఆధ్వర్యంలో యోగా గురువు దాసరి రవీందర్ నేతృత్వంలో యోగా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కొలకాని రాజు, ఆకుల రాజేందర్, శీలం శ్రీనివాస్ మాట్లాడుతూ యోగా అనేది భారతీయ సంస్కృతికి ప్రతీక అని, వేల సంవత్సరాల క్రితమే యోగులు, ఋషులు యోగా ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత సాధ్యమవుతుందని నిరూపించారని తెలిపారు. విదేశీ పాలనలో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు దెబ్బతగిలిందని, అయితే ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో యోగా విశిష్టతను ప్రపంచానికి చాటిచెప్పారని పేర్కొన్నారు.

ప్రపంచ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే యోగాను నిత్యజీవితంలో భాగంగా చేసుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారని, ఆయన కృషి ఫలితంగానే నేడు ప్రపంచ దేశాలన్నీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాయని కొనియాడారు.

యోగాతో శారీరక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు మానసిక ఒత్తిడి తగ్గి, ఏకాగ్రత పెరుగుతుందని పేర్కొంటూ ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ కొంత సమయం యోగాకు కేటాయించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో రాజేష్ ఠాకూర్, కైలాసకొటి గణేష్, ఆకుల తిరుపతి, కొండ్లె నగేష్, రాకేష్ ఠాకూర్, రమారెడ్డి, గంగాభవాని, పల్లపు రవి, నసీరుద్దీన్, బల్సుకూరి రాజేష్, అప్పాల రవీందర్, యాంసాని సమ్మయ్య, గండికోట సమ్మన్న తదితరులు పాల్గొన్నారు.IMG-20260621-WA0071

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .