అత్యవసర పరిస్థితుల్లో జిల్లా కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలి...
జిల్లా రెవెన్యూ అధికారి రామ్మూర్తి.
ఖమ్మం బ్యూరో , జూన్ - 20(తెలంగాణ ముచ్చట్లు )
జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ఆదేశాల మేరకు జిల్లాలో అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కలెక్టరేట్ లో జిల్లా కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించినట్లు జిల్లా రెవెన్యూ అధికారి సి.హెచ్. రాంమూర్తి శనివారం తెలిపారు.
జిల్లా కంట్రోల్ రూమ్ 24 గంటల పాటు మూడు షిఫ్టుల్లో నిరంతరాయంగా పని చేస్తుందని అన్నారు. భారీ వర్షాలు, వరదలు, ప్రకృతి వైపరీత్యాలు, తదితర అత్యవసర పరిస్థితుల సమాచారాన్ని ప్రజలు వెంటనే కంట్రోల్ రూమ్‌కు తెలియజేయాలని సూచించారు.
అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు టోల్ ఫ్రీ నంబర్ 1077 లేదా మొబైల్ నంబర్ 9063211298 కు ఫోన్ చేసి సమాచారం అందించవచ్చని తెలిపారు. అలాగే వ్యవసాయానికి సంబంధించి జిల్లాలో నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువుల విక్రయాలు, ఇతరాలపై కూడా ప్రజలు కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
కంట్రోల్ రూమ్‌కు వచ్చే ప్రతి కాల్, ఫిర్యాదును నమోదు చేసి సంబంధిత శాఖలకు వెంటనే సమాచారం అందజేసి సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు అత్యవసర సమయాల్లో కంట్రోల్ రూమ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి సి.హెచ్. రాంమూర్తి కోరారు.


Comments