ప్రజల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తా.

ప్రజల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తా.

హుజూరాబాద్, జూన్ 17(తెలంగాణ ముచ్చట్లు ):

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండల పరిధిలోని చెల్పూర్ గ్రామంలో సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) సాధన కమిటీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆర్‌టీఐ సాధన కమిటీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ చంటి ముదిరాజ్ ఆదేశాల మేరకు జరిగిన ఈ సమావేశంలో చెల్పూర్ గ్రామ ఆర్‌టీఐ సాధన కమిటీ నూతన అధ్యక్షుడిగా ఆకునూరి కుమారస్వామిని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా ఆకునూరి కుమారస్వామి మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన జాతీయ అధ్యక్షుడు డాక్టర్ చంటి ముదిరాజ్, కాట్రపల్లి గ్రామ అధ్యక్షుడు ఎం. రాజు, హుజూరాబాద్ మండల ప్రధాన కార్యదర్శి బండ నరేందర్‌తో పాటు కమిటీ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలకు మరింత చేరువగా ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత పెంపొందించడంతో పాటు ప్రజల హక్కుల పరిరక్షణ కోసం ఆర్‌టీఐ వేదికగా నిరంతరం పనిచేస్తానని స్పష్టం చేశారు.
నూతన అధ్యక్షుడి ఎన్నికతో చెల్పూర్ గ్రామంలో ఆర్‌టీఐ సాధన కమిటీ కార్యకలాపాలు మరింత బలోపేతం అవుతాయని సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .