మరణానంతరం కూడా మిత్రుడికి అండగా.. కుటుంబానికి లక్ష రూపాయల సహాయం.

మరణానంతరం కూడా మిత్రుడికి అండగా.. కుటుంబానికి లక్ష రూపాయల సహాయం.

జమ్మికుంట టౌన్ జూన్ 14 (తెలంగాణ ముచ్చట్లు):

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణానికి చెందిన గుండా సురేందర్ ఇటీవల గుండెపోటు, వడదెబ్బ కారణంగా మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని ఆదుకునేందుకు జమ్మికుంట జెడ్పీ ఉన్నత పాఠశాల 1983-84 పదవ తరగతి బ్యాచ్‌కు చెందిన బాల్యమిత్రులు ముందుకు వచ్చారు.

సురేందర్‌తో కలిసి విద్యాభ్యాసం చేసిన మిత్రులు తమ వంతు సహాయంగా రూ.1 లక్షలను సమకూర్చి ఆదివారం ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ మొత్తాన్ని మృతి చెందిన సురేందర్ కుమార్తె పేరుతో స్థిర నిక్షేపంగా జమ చేశారు.

ఈ సందర్భంగా మిత్రులు మాట్లాడుతూ, కష్టసుఖాల్లో పరస్పరం అండగా నిలవడం నిజమైన స్నేహానికి నిదర్శనమని పేర్కొన్నారు. "స్నేహమే జీవితం" అనే భావనతో తమ బృందం ఎల్లప్పుడూ ఐక్యంగా ఉంటుందని, సురేందర్ కుటుంబానికి భవిష్యత్తులో కూడా అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో బాల్యమిత్రుల సేవాసమితి సభ్యులు మంద వెంకట్ రెడ్డి, కనుమల్ల గణపతి, ఆర్. సంపత్ కుమార్, పెంచలయ్య, కొక్కుల రాజేందర్, డి. రాజేందర్, సాంబయ్య, సమ్మయ్య, గుడిమల్ల బలరాం, ఎ. సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .