కవంపల్లి సత్యనారాయణపై అనవసర విమర్శలు మానుకోవాలి .సొల్లు బాబు

కవంపల్లి సత్యనారాయణపై అనవసర విమర్శలు మానుకోవాలి .సొల్లు బాబు

హుజూరాబాద్, జూన్ 2(తెలంగాణ ముచ్చట్లు): 

మానకొండూరు ఎమ్మెల్యే, షెడ్యూల్డ్ కులాల కమిటీ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణపై అనవసర విమర్శలు చేయడం సరికాదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సొల్లు బాబు అన్నారు. ఈ మేరకు ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
తిప్పారపు సంపత్ గారిని ఉద్దేశించి మాట్లాడుతూ, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సమాజానికి లేదా పార్టీకి సంబంధించిన ఏదైనా పొరపాటు చేస్తే దానిని సంబంధిత పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని, కానీ బహిరంగంగా విమర్శలు చేయడం వల్ల సమాజంలో తప్పు సంకేతాలు వెళ్తాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర స్థాయి నాయకత్వం, మంత్రులు, పార్టీ పెద్దలు ఉన్నారని, సమస్యలు ఉంటే వారి ద్వారా పరిష్కారం కోరాలని సూచించారు.
కవ్వంపల్లి సత్యనారాయణకు హుజూరాబాద్ నియోజకవర్గంతో పాటు జిల్లాలోని అనేక వర్గాల ప్రజల్లో మంచి ఆదరణ, అభిమానులు ఉన్నారని సొల్లు బాబు తెలిపారు. ఎస్సీ, బీసీ, ఇతర వర్గాల ప్రజలు ఆయనకు మద్దతుగా ఉన్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో కరీంనగర్ జిల్లాలో పార్టీని బలోపేతం చేయడంలో కవ్వంపల్లి కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు.
కాంగ్రెస్ పార్టీ కోసం ఆయన ఎన్నో సంవత్సరాలుగా కష్టపడ్డారని, పార్టీ అభివృద్ధి కోసం ఆర్థికంగా, రాజకీయంగా ఎంతో సేవ చేశారని అన్నారు. అలాంటి నాయకుడిపై విమర్శలు చేయడం ద్వారా రాజకీయంగా ఎదగాలని భావించడం సరైన పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు.
సమాజంలో మంచి కార్యక్రమాలు నిర్వహించడం, ప్రజా సమస్యలపై స్పందించడం వంటి అంశాల్లో అందరూ కలిసి పనిచేయాలని, అయితే నాయకుల ప్రతిష్టకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేస్తే తగిన విధంగా స్పందించాల్సి వస్తుందని హెచ్చరించారు. సమాజ ఐక్యతను కాపాడుకుంటూ ముందుకు సాగాలని సొల్లు బాబు కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .