వెల్టూర్ లో సీసీ రోడ్డు, అండర్ డ్రైనేజీ పనులకు శ్రీకారం.

వెల్టూర్ లో సీసీ రోడ్డు, అండర్ డ్రైనేజీ పనులకు శ్రీకారం.

పార్టీలకు అతీతంగా వెల్టూర్ అభివృద్ధికి కృషి చేస్తాం

పెద్దమందడి,ఆగస్టు14(తెలంగాణ ముచ్చట్లు):

వడ్డే శేఖర్, కాంగ్రెస్ నాయకులువనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణంతో పాటు అండర్ డ్రైనేజీ పనులకు కాంగ్రెస్ నాయకులు వడ్డే శేఖర్ ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు వడ్డే శేఖర్ మాట్లాడుతూ.. గ్రామంలో అవసరమైన అభివృద్ధి పనులను దశలవారీగా చేపడుతున్నామని తెలిపారు. ఎమ్మెల్యే మేఘా రెడ్డి సహకారంతో వెల్టూర్ గ్రామ అభివృద్ధికి మరింత ప్రాధాన్యత లభిస్తోందని అన్నారు. పార్టీలకు అతీతంగా గ్రామ అభివృద్ధి లక్ష్యంగా, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని తెలిపారు. గ్రామ అభివృద్ధికి అవసరమైన మరిన్ని పనులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి సాధించేందుకు కృషి చేస్తామని వడ్డే శేఖర్ తెలిపారు. సీసీ రోడ్డు, అండర్ డ్రైనేజీ పనులు పూర్తయితే గ్రామంలో మౌలిక వసతులు మరింత మెరుగుపడతాయని పేర్కొన్నారు.గ్రామ అభివృద్ధికి అవసరమైన పనులను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని వడ్డే శేఖర్ తెలిపారు. కాంగ్రెస్ నాయకుల చొరవతో, ఎమ్మెల్యే మేఘా రెడ్డి సహకారంతో వెల్టూర్ లో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు కృషి చేస్తామని అన్నారు.గ్రామ సర్పంచ్ అశోక్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రేమ్ సాగర్, మాజీ అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి (బాబు రెడ్డి), వడ్డే శేఖర్, డిఎస్ మహేష్, వార్డు సభ్యులు నాగభూషణ్, కురుమయ్య, మిల్లర్ రాజు, వివేక్, రామచంద్రయ్య, మద్దూర్ వెంకటయ్య, సాధిక్, చందు రెడ్డి, అనంతి రెడ్డి, కుమ్మరి కొండన్న, నాగార్జున, లక్ష్మణ్, బాలరాజ్, ఆనంద్, శ్రీను సాగర్, తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ విజయవంతం. హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ విజయవంతం.
జమ్మికుంట టౌన్, ఆగస్టు 14 (తెలంగాణ ముచ్చట్లు): కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా...
ప్రభుత్వానికి రూ.2.42 కోట్ల నష్టం.. రైస్ మిల్ యజమాని అరెస్ట్.
పోచమ్మ తల్లి ఆలయంలో బోరుబావికి శ్రీకారం.
పేదల సంక్షేమ పథకాల పరిరక్షణలో ప్రభుత్వం విఫలం.
విద్యారంగ సమస్యలపై యూఎస్పీసీ సమరభేరి.
సత్తుపల్లిలో 6.36 కిలోల గంజాయి పట్టివేత.
IIIT సీటు సాధించిన హాసినికి సర్పంచ్ ఆర్థిక సాయం.