అనుమతుల్లేకుండా ఇసుక తరలింపు.. ఐదు ట్రాక్టర్లపై కేసులు.
పెద్దమందడి ఎస్సై జలంధర్ రెడ్డి.
పెద్దమందడి,ఆగస్టు10(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండల పరిధిలోని చిలుకుటోనిపల్లి వాగు నుంచి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లపై కేసులు నమోదు చేసినట్లు పెద్దమందడి ఎస్సై జలంధర్ రెడ్డి తెలిపారు.ఎస్సై వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి కొత్తకోట మండలం కన్నిమేట గ్రామానికి చెందిన ఐదు ఇసుక ట్రాక్టర్లు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా చిలుకుటోనిపల్లి వాగు నుంచి ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఇసుకను తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను పట్టుకుని పెద్దమందడి పోచం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం సంబంధిత ట్రాక్టర్లపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.ఈ సందర్భంగా ఎస్సై జలంధర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడే వారిపై నిరంతరం నిఘా కొనసాగుతుందని తెలిపారు.


Comments