ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి.

బీజేపీ మండల అధ్యక్షుడు ముప్పూరి చెన్నయ్య.

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి.

పెద్దమందడి,ఆగస్టు10(తెలంగాణ ముచ్చట్లు):

 వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మణిగిళ్ల గ్రామంలో బీజేపీ పెద్దమందడి మండల అధ్యక్షుడు ముప్పూరి చెన్నయ్య తన ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రతి భారతీయుడు తమ ఇంటిపై కుటుంబ సభ్యులతో కలిసి జాతీయ జెండాను ఎగురవేయాలని ఆయన పిలుపునిచ్చారు.దేశభక్తి, జాతీయ ఐక్యతను చాటేలా ప్రతి కుటుంబం జాతీయ జెండాను గౌరవంగా తమ ఇంటిపై ఎగురవేయాలని చెన్నయ్య కోరారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధులు, సైనికుల త్యాగాలను స్మరించుకుంటూ జాతీయ జెండా పట్ల గౌరవాన్ని చాటాలని అన్నారు.ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడేలా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. దేశభక్తి భావనను ప్రతి కుటుంబంలో పెంపొందించడంతో పాటు యువతలో జాతీయ స్ఫూర్తిని నింపాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

కేంద్ర విధానాలపై ప్రజా సంఘాల పోరుబాట. కేంద్ర విధానాలపై ప్రజా సంఘాల పోరుబాట.
జమ్మికుంట, టౌన్ ఆగస్టు 10 (తెలంగాణ ముచ్చట్లు): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ...
కనపర్తిలో కాంగ్రెస్‌ బలోపేతానికి కొత్త కమిటీ.
అర్చకుల సంక్షేమానికి అంకితమైన నాయకత్వం.
ప్రతి పేద బిడ్డకు నాణ్యమైన విద్యే ధ్యేయం.
అనుమతుల్లేకుండా ఇసుక తరలింపు.. ఐదు ట్రాక్టర్లపై కేసులు.
సవాల్ విసిరితే బీఆర్‌ఎస్‌ నాయకులు ఎక్కడ?
రైతుకు నీళ్లు ఇస్తే స్వాగతిస్తాం.. ఇవ్వకపోతే ఉద్యమిస్తాం.