ప్రతి గడపకు సంక్షేమం చేరవేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: వొడితల ప్రణవ్.

ప్రతి గడపకు సంక్షేమం చేరవేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: వొడితల ప్రణవ్.

* ఇల్లందకుంట మండలంలో రూ.8 లక్షల విలువైన 24 సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ – లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి అందజేత

ఇల్లందకుంట, ఆగస్టు 6 (తెలంగాణ ముచ్చట్లు):

ప్రజలకు ఉపయోగపడే సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను వేగంగా అందజేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన ద్వారా ప్రతి గడపకు సంక్షేమాన్ని, ప్రతి ఇంటికి అభివృద్ధి ఫలాలను చేరవేస్తోందని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ తెలిపారు.
గురువారం ఇల్లందకుంట మండలంలోని ఇల్లందకుంట, చిన్న కోమటిపల్లి, టేకుర్తి, బూజునూరు, రాచపల్లి, మల్లన్నపల్లి, శ్రీరాములపల్లి, కనగర్తి, లక్ష్మాజీపల్లి, మల్యాల, వాగొడ్డు రామన్నపల్లి తదితర గ్రామాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా దాదాపు రూ.8 లక్షల విలువైన 24 సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, గ్రామాలు, పట్టణాల్లో పర్యటించే సమయంలో ప్రజలు తమ దృష్టికి తీసుకొస్తున్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సూచించినట్లు చెప్పారు.
ప్రజల సంక్షేమం, ప్రాంత అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి రాజీ పడదని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో భాగంగా శ్రీరాములపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇల్లందకుంట దేవాలయ చైర్మన్ రామారావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్ది కుమార్, జిల్లా అధికార ప్రతినిధులు, వివిధ సంస్థల డైరెక్టర్లు, పలు గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.IMG-20260806-WA0052

Tags:

Post Your Comments

Comments

Latest News

తెలంగాణ భావజాలానికి చిరునామా జయశంకర్ సార్: మొలుగు ప్రశాంత్ కుమార్. తెలంగాణ భావజాలానికి చిరునామా జయశంకర్ సార్: మొలుగు ప్రశాంత్ కుమార్.
జమ్మికుంట టౌన్, ఆగస్టు 06 (తెలంగాణ ముచ్చట్లు): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి సిద్ధాంతపరమైన పునాది వేసి, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్నంతా అంకితం చేసిన...
హుజురాబాద్ అభివృద్ధిపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సమీక్ష.
ప్రతి గడపకు సంక్షేమం చేరవేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: వొడితల ప్రణవ్.
వివేకానంద విగ్రహం తొలగింపు అవసరం లేదు: హైకోర్టు.
రోడ్డు ప్రమాద బాధిత చిన్నారికి అండగా సబ్బాని వెంకట్.
కాంగ్రెస్ సీనియర్ నేత సొల్లు బాబు జన్మదిన వేడుకలు.
ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి.. బీఆర్ఎస్‌కు పెరుగుతున్న ఆదరణ: కౌశిక్ రెడ్డి.