జమ్మికుంటలో సింథటిక్ ట్రాక్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్.
రూ.6.50 కోట్ల మంజూరు.
జమ్మికుంట,ల్ టౌన్ ఆగస్టు 04 (తెలంగాణ ముచ్చట్లు):
కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో రూ.6.50 కోట్ల వ్యయంతో 400 మీటర్ల, నాలుగు లేన్ల సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది.
లోక్‌సభలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అడిగిన ప్రశ్నకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ లిఖితపూర్వకంగా సమాధానమిస్తూ ఈ వివరాలను వెల్లడించారు. క్రీడాకారులకు మెరుగైన శిక్షణా సదుపాయాలు కల్పించేందుకు ఈ ప్రాజెక్టుకు రూ.6.50 కోట్ల నిధులు ఆమోదించినట్లు తెలిపారు.
ఈ ట్రాక్ నిర్మాణం పూర్తయితే జమ్మికుంటతో పాటు పరిసర ప్రాంతాల క్రీడాకారులకు అత్యాధునిక శిక్షణా వేదిక అందుబాటులోకి రానుంది. జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు అథ్లెట్ల ప్రతిభను మరింత మెరుగుపర్చేందుకు ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని క్రీడా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


Comments