బాధితులకు కొండంత అండగా పీఎస్ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్.

బాధితులకు కొండంత అండగా పీఎస్ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్.

- *తిరుమలాయపాలెం మండలంలోని 26 గ్రామాల్లో ఆర్థిక సాయం అందజేత*

- *మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సూచనలతో 60 కుటుంబాలకు రూ.10 వేల చొప్పున పంపిణీ*

ఖమ్మం బ్యూరో, ఆగస్టు 3(తెలంగాణ ముచ్చట్లు )

తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సూచనల మేరకు తిరుమలాయపాలెం మండలంలో పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయం పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. జూలై 1 నుంచి జూలై 31 వరకు వివిధ కారణాలతో మరణించిన మొత్తం 60 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. 10,000 చొప్పున.. మొత్తం రూ. 6 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

మండల పరిధిలోని తిరుమలాయపాలెం, బాలాజీనగర్ తండా, పిండిప్రోలు, తెట్టెలపాడు, కేశవాపురం, తిప్పారెడ్డిగూడెం, అజ్మీరా తండా, జల్లెపల్లి, హైదర్‌సాయిపేట, పాతర్లపాడు, గోల్‌తండా, చంద్రుతండా, మేకలతండా, మేడిదపల్లి, మహ్మదాపురం, ఇస్లావత్‌తండా, రఘునాథపాలెం, కాకరవాయి, జూపెడ, రాజారం, బచ్చోడుతండా, బచ్చోడు, బీరోలు, ఏలువారిగూడెం, దమ్మాయిగూడెం, ఎర్రగడ్డ తండా మొత్తం 26 గ్రామాల్లో బాధితుల ఇళ్లకు వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించి ఈ సహాయాన్ని పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ... ప్రతి నెల క్రమం తప్పకుండా పీఎస్ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా బాధితులకు ఆర్థిక సాయం అందిస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కొండంత అండగా నిలుస్తున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, పొంగులేటి అభిమానులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఖమ్మం జిల్లాలో జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల జారీని వేగవంతం చేయాలి.  ఖమ్మం జిల్లాలో జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల జారీని వేగవంతం చేయాలి. 
జిల్లా కలెక్టర్‌కు గ్రీవెన్స్ లో టిడబ్ల్యూజేఎఫ్ (హెచ్- 2843) వినతి. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నానబాల రామకృష్ణ,అర్వపల్లి నగేష్. ఖమ్మం బ్యూరో , ఆగస్టు 3(తెలంగాణ ముచ్చట్లు...
శ్రీనన్న ఆత్మీయ భరోసా..ప్రతి పేద కుటుంబ నమ్మకానికి ప్రతిక.
తెలంగాణ సాహితీ సంఘంలో గీతాకుమారికి స్థానం.
వేణుకుమార్ కుటుంబానికి నామ ట్రస్ట్ ద్వారా రూ.50 వేల ఆర్థిక సాయం.
బాధితులకు కొండంత అండగా పీఎస్ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్.
కాకర్లపల్లి పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి.
బాధితులకు కొండంత అండగా పీఎస్ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్.