నూతన బోధనా పద్ధతులను ఉపాధ్యాయులు అలవర్చుకోవాలి.

మండల విద్యాధికారి చదువుల సత్యనారాయణ.

నూతన బోధనా పద్ధతులను ఉపాధ్యాయులు అలవర్చుకోవాలి.

ఎల్కతుర్తి, జూలై 21 (తెలంగాణ ముచ్చట్లు):

విద్యా రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఉపాధ్యాయులు నూతన బోధనా పద్ధతులను అలవర్చుకుని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని మండల విద్యాధికారి చదువుల సత్యనారాయణ అన్నారు.
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఎస్‌జీటీలకు మొదటి విడత మూడు రోజుల పౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్) రెమిడియేషన్ శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్‌లో ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, వర్క్‌బుక్స్ ఆధారిత బోధన, ఆటల ద్వారా అభ్యాసం, కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత బోధన, సమగ్ర మూల్యాంకనం వంటి అంశాలపై ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ ద్వారా విద్యార్థుల అభ్యాస సామర్థ్యాలను పెంపొందించడంతో పాటు బోధనను మరింత ప్రభావవంతంగా తీర్చిదిద్దే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
నూతన విద్యా విధానానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని బోధనలో వినియోగించుకోవాలని, ముఖ్యంగా కృత్రిమ మేధస్సు వినియోగంపై ఉపాధ్యాయులు అవగాహన పెంపొందించుకోవాలని చదువుల సత్యనారాయణ సూచించారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్లుగా శ్రీనివాస్, హర్షవర్ధన్ రెడ్డి, వంశీకృష్ణ, విజయ, సీఆర్పీ రవికుమార్ పాల్గొని శిక్షణ అందించారు. కార్యక్రమంలో మండలంలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.IMG-20260721-WA0013

Tags:

Post Your Comments

Comments

Latest News

జమ్మికుంట అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్.. 38 కీలక తీర్మానాలకు కౌన్సిల్ ఏకగ్రీవ ఆమోదం. జమ్మికుంట అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్.. 38 కీలక తీర్మానాలకు కౌన్సిల్ ఏకగ్రీవ ఆమోదం.
* డ్రైనేజీలు, రోడ్లు, తాగునీరు, వీధిదీపాలు, వినాయక నిమజ్జన ఏర్పాట్లకు గ్రీన్ సిగ్నల్ జమ్మికుంట, జూలై 31 (తెలంగాణ ముచ్చట్లు): జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన...
77 వారాలుగా నిరంతర అన్నప్రసాద సేవ.
తరాలను తీర్చిదిద్దిన గురువుకు ఘన వందనం.
శ్రీ మడేలేశ్వరస్వామి బోనాలకు ఘన శ్రీకారం.
గ్రామీణుల ఆరోగ్యానికి బాలవికాస చేయూత.
ఐదవ వార్డులో విస్తృతంగా మొక్కల పంపిణీ.
మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి.