కనగర్తిలో ఉచిత వైద్య శిబిరం.. ఆరోగ్యంపై అవగాహన.
ఇల్లంతకుంట, జూలై 30 (తెలంగాణ ముచ్చట్లు):
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించడంతో పాటు పోషకాహారం తీసుకుంటే ఆరోగ్యవంతమైన జీవనం గడపవచ్చని కనగర్తి గ్రామ సర్పంచ్ రామంచ సంపత్ అన్నారు.
గురువారం బాలవికాస ఆధ్వర్యంలో, హనుమకొండ లక్ష్మీ నరసింహ హాస్పిటల్ సౌజన్యంతో గ్రామపంచాయతీ ఆవరణలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆరోగ్య పరిరక్షణలో పరిశుభ్రతతో పాటు సమతుల్య ఆహారం కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.
అనంతరం డాక్టర్లు తేజస్విని, సంకీర్తన మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ప్రతి ఒక్కరూ కనీసం ఆరు నెలలకు ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. ముఖ్యంగా యుక్తవయసు బాలికలు రక్తహీనతకు గురికాకుండా పోషక విలువలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు.
శిబిరంలో బాలవికాస కోఆర్డినేటర్లు కే. సుమలత, ఏ. స్వాతి, ఆసియా, గ్రామ కార్యదర్శి క్రాంతికుమార్, తాళ్లపల్లి శ్రీను, బాలవికాస విలేజ్ లీడర్ కవిత, లక్ష్మీ నరసింహ హా
స్పిటల్ పీఆర్‌వోలు బిక్షపతి, సంపత్ రెడ్డి, రాజేష్, సిబ్బంది ప్రసన్న, భారతి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. గ్రామానికి చెందిన పలువురు ప్రజలు వైద్య పరీక్షలు చేయించుకుని ఉచిత వైద్య సేవలను వినియోగించుకున్నారు.


Comments