వెల్టూర్ లో బీఎల్‌ఓల కృషి,ప్రజల సహకారంతో ఎస్‌ఐఆర్ ప్రక్రియ విజయవంతం.
బీఎల్‌ఓలు అభినందించిన మాజీ జెడ్పీటీసీ రఘుపతి రెడ్డి.
పెద్దమందడి,జులై30(తెలంగాణ ముచ్చట్లు):
బీఎల్‌ఓల అంకితభావం, నిరంతర కృషి, గ్రామ ప్రజల సంపూర్ణ సహకారంతో వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియను 100 శాతం విజయవంతంగా పూర్తి చేసినట్లు పెద్దమందడి మాజీ జెడ్పీటీసీ రఘుపతి రెడ్డి తెలిపారు.ఎస్‌ఐఆర్ ప్రక్రియ విజయవంతానికి కృషి చేసిన బీఎల్‌ఓలను, వారికి ఇన్‌చార్జ్‌గా వ్యవహరించిన అధికారి కరుణతో పాటు ఈ ప్రక్రియలో భాగస్వాములైన అధికార యంత్రాంగాన్ని రఘుపతి రెడ్డి ఆధ్వర్యంలో, గ్రామ సర్పంచ్ అశోక్ సమక్షంలో ఘనంగా సన్మానించి అభినందించారు.ఈ సందర్భంగా రఘుపతి రెడ్డి మాట్లాడుతూ.. వెల్టూర్ గ్రామంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ 100 శాతం పూర్తికావడం ఆనందంగా ఉంది. గ్రామ ప్రజల సహకారంతో పాటు బీఎల్‌ఓలు, అధికారి కరుణ, అధికార యంత్రాంగం బాధ్యతాయుతంగా, నిబద్ధతతో పనిచేయడం వల్లే ఈ విజయం సాధ్యమైంది అని పేర్కొన్నారు.ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు అవసరమైన సమాచారం అందిస్తూ, ప్రక్రియను సకాలంలో పూర్తి చేయడంలో బీఎల్‌ఓలు కీలక పాత్ర పోషించారని అన్నారు. వారికి సమర్థవంతంగా మార్గనిర్దేశం చేసి, ప్రక్రియను సమన్వయం చేసిన అధికారి కరుణ సేవలు అభినందనీయమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో పెద్దమందడి తహసీల్దార్ మల్లికార్జున్, ఎంపీడీవో పరిణత, బీఎల్‌ఓలు, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.


Comments