జలసిరి కార్యక్రమంపై గ్రామసభ నిర్వహణ.

జలసిరి కార్యక్రమంపై గ్రామసభ నిర్వహణ.

వేలేరు, జూలై 29 (తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మేజర్ గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ బిల్లా యాదగిరి అధ్యక్షతన తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలసిరి కార్యక్రమంపై గ్రామసభ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వేలేరు తహసీల్దార్ శ్రీమతి కోమి, మండల అభివృద్ధి అధికారి ఎంపీడీఓ కిషన్ నాయక్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్, తహసీల్దార్, ఎంపీడీఓ మాట్లాడుతూ ఎలినినో ప్రభావంతో వర్షపాతం తగ్గుతున్న నేపథ్యంలో ప్రతి నీటి బొట్టును సంరక్షించే లక్ష్యంతో "ప్రతి ఇంటికి ఇంకుడు గుంత – ప్రతి పంటకు పంట కుంట" కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. గ్రామపంచాయతీ ద్వారా ప్రతి ఇంకుడు గుంతకు రూ.6,500 ఆర్థిక సహాయం అందజేయడంతో పాటు, రైతులకు ఉచితంగా పంట కుంటలు ఏర్పాటు చేసి, ఉచిత చేప పిల్లలను కూడా పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రతి గ్రామస్థుడు, రైతు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ గ్రామసభలో మండల ఎంపీవో బుచ్చిరెడ్డి, ఉప సర్పంచ్ శ్రీకర్, గ్రామపంచాయతీ కార్యదర్శి విజయ, ఎస్ బి ఐ బ్యాంక్ స్థానిక మేనేజర్ భిక్షపతి, హెల్త్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, ఆర్ ఐ ఓ సురేందర్, వ్యవసాయ శాఖ అధికారి రాజశేఖర్, ఐకేపీ సీసీ రమాదేవి, విద్యాశాఖ ప్రతినిధి లీలాబాయి, నీటిపారుదల, విద్యుత్ శాఖల అధికారులు, వార్డు సభ్యులు సంధ్య, పర్వీన్, మౌనిక, చైతన్య, లక్ష్మీనారాయణ, కృపసాగర్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. అలాగే పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు హాజరయ్యారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

వ్యవసాయ పనుల్లో విషాదం.. ట్రాక్టర్ బోల్తాపడి రైతు మృతి. వ్యవసాయ పనుల్లో విషాదం.. ట్రాక్టర్ బోల్తాపడి రైతు మృతి.
జమ్మికుంట రూరల్ జూలై 29 (తెలంగాణ ముచ్చట్లు): జమ్మికుంట మండలంలోని అంకుశాపూర్ గ్రామంలో వ్యవసాయ పనులు చేస్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడటంతో ఓ రైతు మృతిచెందిన విషాద...
గడువులోగా ఎస్ ఐ ఆర్ ప్రక్రియను 100 శాతం పూర్తి చేయాలి.
నామ తల్లిదండ్రుల స్మృతి వనాన్ని సందర్శించిన లెఫ్టినెంట్ గవర్నర్.
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు : మంత్రి పొంగులేటి.
విద్యార్థుల భవిష్యత్తే రాష్ట్రానికి అసలైన పెట్టుబడి : మంత్రి పొంగులేటి.
బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు ఎన్నికైన ఉదయ్ నాగరాజుకు ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి సత్కారం.
రాహుల్ గాంధీపై పొంగులేటి సుధాకర్ రెడ్డి వ్యాఖ్యలు.