వ్యవసాయ పనుల్లో విషాదం.. ట్రాక్టర్ బోల్తాపడి రైతు మృతి.

అంకుశాపూర్‌లో దుర్ఘటన.. కుటుంబంలో విషాద ఛాయలు.

వ్యవసాయ పనుల్లో విషాదం.. ట్రాక్టర్ బోల్తాపడి రైతు మృతి.

జమ్మికుంట రూరల్ జూలై 29 (తెలంగాణ ముచ్చట్లు):

జమ్మికుంట మండలంలోని అంకుశాపూర్ గ్రామంలో వ్యవసాయ పనులు చేస్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడటంతో ఓ రైతు మృతిచెందిన విషాద ఘటన బుధవారం చోటుచేసుకుంది.
పట్టణ సీఐ రామకృష్ణ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. అంకుశాపూర్ గ్రామానికి చెందిన అరుకాల కుమారస్వామి తన వ్యవసాయ పొలంలో ట్రాక్టర్‌తో పనులు నిర్వహిస్తున్న సమయంలో ఒక్కసారిగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ట్రాక్టర్ కింద చిక్కుకున్న కుమారస్వామి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు.
సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని ట్రాక్టర్ కింద నుంచి ఆయనను బయటికి తీసేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు.
ఈ ఘటనతో అంకుశాపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ రామకృష్ణ గౌడ్ తెలిపారు.IMG-20260729-WA0041

Tags:

Post Your Comments

Comments

Latest News

వ్యవసాయ పనుల్లో విషాదం.. ట్రాక్టర్ బోల్తాపడి రైతు మృతి. వ్యవసాయ పనుల్లో విషాదం.. ట్రాక్టర్ బోల్తాపడి రైతు మృతి.
జమ్మికుంట రూరల్ జూలై 29 (తెలంగాణ ముచ్చట్లు): జమ్మికుంట మండలంలోని అంకుశాపూర్ గ్రామంలో వ్యవసాయ పనులు చేస్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడటంతో ఓ రైతు మృతిచెందిన విషాద...
గడువులోగా ఎస్ ఐ ఆర్ ప్రక్రియను 100 శాతం పూర్తి చేయాలి.
నామ తల్లిదండ్రుల స్మృతి వనాన్ని సందర్శించిన లెఫ్టినెంట్ గవర్నర్.
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు : మంత్రి పొంగులేటి.
విద్యార్థుల భవిష్యత్తే రాష్ట్రానికి అసలైన పెట్టుబడి : మంత్రి పొంగులేటి.
బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు ఎన్నికైన ఉదయ్ నాగరాజుకు ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి సత్కారం.
రాహుల్ గాంధీపై పొంగులేటి సుధాకర్ రెడ్డి వ్యాఖ్యలు.