గ్రామ స్థాయి నుంచి పార్టీ విస్తరణకు కార్యాచరణ.

గ్రామ స్థాయి నుంచి పార్టీ విస్తరణకు కార్యాచరణ.

 ఎల్కతుర్తి , జూలై 27 (తెలంగాణ ముచ్చట్లు):

భారతీయ జనతా పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఎల్కతుర్తి మండలంలో ఎస్‌ఐఆర్  ప్రవాస్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రీ కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మండల సంయోజక్‌గా హాజరై మండల పదాధికారులు, మోర్చాల అధ్యక్షులు, శక్తికేంద్ర ఇన్‌చార్జిలతో సమావేశమయ్యారు.
పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్ఠం చేయాలంటే గ్రామ, బూత్ స్థాయిలో కార్యకర్తలు చురుకుగా పనిచేయాలని ఆయన సూచించారు. మండలంలోని పలు గ్రామాల బూత్ కమిటీల పనితీరును సమీక్షించి, పార్టీ విస్తరణకు చేపట్టాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ప్రతి బూత్‌లో పార్టీ బలోపేతమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
అనంతరం ఇటీవల నూతనంగా ఎన్నికైన మండల పదాధికారులను ఘనంగా సన్మానించి, పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ సమావేశానికి బీజేపీ ఎల్కతుర్తి మండల అధ్యక్షులు శ్రీ మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ అధ్యక్షత వహించగా, మండల పదాధికారులు, మోర్చాల అధ్యక్షులు, శక్తికేంద్ర ఇన్‌చార్జిలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ప్రభుత్వ పాఠశాలలకు వాటర్ ప్యూరీఫైర్లు. ప్రభుత్వ పాఠశాలలకు వాటర్ ప్యూరీఫైర్లు.
హుజురాబాద్,జులై 27(తెలంగాణ ముచ్చట్లు ): హుజూరాబాద్ నియోజకవర్గంలో విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని జయన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఆధునిక...
కీశే గడ్డం లక్ష్మికి బీసీ జేఏసీ నాయకుల ఘన నివాళి.
అర్చక కుటుంబానికి ఆర్థిక చేయూత .
పర్యాటక రంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి.
విధులు నిర్వర్తిస్తున్నా వేతనాలు అందడం లేదంటూ ఆవేదన.
విద్యార్థుల దాహార్తి తీర్చిన రామ్‌కీ ఫౌండేషన్.
పెద్దమందడి రైతు వేదికలో విత్తన మేళా ప్రారంభం.