ఎస్‌ఐఆర్‌పై కాంగ్రెస్ విస్తృత స్థాయి సమీక్ష.

ఎస్‌ఐఆర్‌పై కాంగ్రెస్ విస్తృత స్థాయి సమీక్ష.

జమ్మికుంట మండల, పట్టణ బీఎల్‌ఏలు–కోఆర్డినేటర్లతో సమావేశమైన వొడితల ప్రణవ్.

జమ్మికుంట టౌన్ జులై 24 (తెలంగాణ ముచ్చట్లు):

తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న సమగ్ర ఓటరు నమోదు సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. శుక్రవారం హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జమ్మికుంట మండల, పట్టణ పరిధికి చెందిన బీఎల్‌ఏలు, కోఆర్డినేటర్లతో హుజురాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ విస్తృత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా బీఎల్‌ఏల పనితీరు, ఓటరు నమోదు ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలు, సందేహాలపై సమగ్రంగా చర్చించారు. బీఎల్‌ఏల వద్ద ఉన్న సమాచారం పూర్తిగా కోఆర్డినేటర్ల వద్ద కూడా ఉండాలని సూచించారు. గ్రామాలు, పట్టణంలో ఓటరు నమోదు ఫారాలు అందుబాటులో లేకపోతే వెంటనే సంబంధిత బీఎల్‌ఓలకు సమాచారం అందించి, ఆ వివరాలను పార్టీ నాయకత్వానికి చేరవేయాలని తెలిపారు. సమస్యలు తమ దృష్టికి వస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
సమగ్ర ఓటరు నమోదు ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రాధాన్యంతో పనిచేస్తోందని, ఈ అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుజురాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సమీక్షించినట్లు తెలిపారు. అర్హత కలిగిన ఒక్క ఓటరు కూడా నమోదు కాకుండా మిగిలిపోకుండా కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు.
ఈ సమావేశంలో జమ్మికుంట పట్టణ, మండల కాంగ్రెస్ నాయకులు, బీఎల్‌ఏలు, కోఆర్డినేటర్లు, గ్రామస్థాయి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News