నూతన ఎంపీడీవోకు దేవస్థానం చైర్మన్ మర్యాదపూర్వక సన్మానం.
జమ్మికుంట టౌన్ జూలై 14 (తెలంగాణ ముచ్చట్లు):
ఇటీవల ఇల్లంతకుంట మండల ఎంపీడీవో (మండల పరిషత్ అభివృద్ధి అధికారి)గా బాధ్యతలు స్వీకరించిన విజయ్‌కుమార్‌ను శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం చైర్మన్ ఇంగిలే రామారావు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం స్వామివారి ప్రసాదంతో పాటు ముత్యాల తలంబ్రాలను అందజేసి ఆశీర్వాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా ఇంగిలే రామారావు మాట్లాడుతూ, ఇల్లంతకుంట మండల అభివృద్ధి, గ్రామాల పురోగతి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎంపీడీవో విజయ్‌కుమార్ సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ, తన పదవీకాలాన్ని విజయవంతంగా నిర్వహించాలని శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్త గొడిశాల పరమేష్, డీసీసీ కార్యదర్శి మేకమల్ల అశోక్, యూత్ కాంగ్రెస్ నాయకుడు ఉప్పుల అమరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Comments