ఒక్కటే సర్క్యూట్‌లో 15 అవార్డులు.. జాతీయ వేదికపై పొనగంటి రాజు ఖ్యాతి.


జమ్మికుంట జులై 11: (తెలంగాణ ముచ్చట్లు)
జమ్మికుంటకు చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ పొనగంటి రాజు జాతీయస్థాయిలో మరోసారి తన ప్రతిభను చాటుకున్నారు. ఇటీవల ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫోటోగ్రఫీ (ఎఫ్‌ఐపీ) నిర్వహించిన జాతీయస్థాయి ఫోటోగ్రఫీ పోటీల్లో ఆయన చిత్రాలు విశేషంగా ఆకట్టుకుని అరుదైన రికార్డును నెలకొల్పాయి.
ఒక్కటే సర్క్యూట్‌లో మొత్తం 15 అవార్డులు సాధించి ఫోటోగ్రఫీ రంగంలో విశేష గుర్తింపు పొందారు. ఇందులో 2 మెమోరియల్ ట్రోఫీ బెస్ట్ ఎంట్రెంట్ అవార్డులు, 8 బంగారు పతకాలు, 5 ఎఫ్‌ఐపీ రిబ్బన్లు ఉన్నాయి. ఒకే సర్క్యూట్‌లో ఇన్ని అవార్డులు సాధించడం అరుదైన ఘనతగా ఫోటోగ్రఫీ వర్గాలు అభినందిస్తున్నాయి.
పొనగంటి రాజు సాధించిన ఈ విజయంతో జమ్మికుంట పేరు జాతీయస్థాయిలో మరోసారి మార్మోగింది. ఆయనకు పలువురు ఫోటోగ్రాఫర్లు, కళాభిమానులు, ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.


Comments