వెల్టూర్ చేనేత సంఘం అధ్యక్షుడు చింతల వెంకటేశ్వర్లకు ఘన సన్మానం.

వెల్టూర్ చేనేత సంఘం అధ్యక్షుడు చింతల వెంకటేశ్వర్లకు ఘన సన్మానం.

పెద్దమందడి,జూలై07(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ ఉన్ని చేనేత పరిశ్రమ సహకార సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన చింతల వెంకటేశ్వర్లను కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.వెల్టూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రేమ్ సాగర్, ఖిల్లా ఘనపూర్–పెద్దమందడి మండలాల వ్యవసాయ మార్కెట్ యార్డు డైరెక్టర్ రవీందర్ కలిసి చింతల వెంకటేశ్వర్లకు శాలువా కప్పి  ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, చేనేత కార్మికుల సంక్షేమం, చేనేత రంగ అభివృద్ధికి చింతల వెంకటేశ్వర్లు సమర్థవంతంగా సేవలందిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయన నాయకత్వంలో వెల్టూర్ చేనేత సంఘం మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.సన్మానానికి స్పందించిన చింతల వెంకటేశ్వర్లు తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంఘ సభ్యులతో పాటు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. చేనేత కార్మికుల సంక్షేమం, సంఘం అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని, అందరి సహకారంతో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని పేర్కొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .