పాఠశాల శాస్త్ర ప్రయోగశాలకు రూ.20 వేల విరాళం అందించిన ఉపసర్పంచ్ శివకృష్ణ .

పాఠశాల శాస్త్ర ప్రయోగశాలకు రూ.20 వేల విరాళం అందించిన ఉపసర్పంచ్ శివకృష్ణ .

ధర్మసాగర్, ఆగస్టు 15 (తెలంగాణ ముచ్చట్లు): 

ధర్మసాగర్ మండలంలోని తాటికాయల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శాస్త్ర ప్రయోగశాలకు గ్రామ ఉపసర్పంచ్ పెసరు శివకృష్ణ రూ.20 వేల విరాళం అందించారు.
80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన పెసరు శివకృష్ణ శాస్త్ర ప్రయోగశాలకు అవసరమైన పరికరాల కొనుగోలు కోసం రూ.20 వేల విరాళాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా ఉపసర్పంచ్ శివకృష్ణ  మాట్లాడుతూ విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని పెంపొందించేందుకు ప్రయోగశాలలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. పాఠశాల అభివృద్ధికి తన వంతు సహకారం అందించడం సంతోషంగా ఉందని తెలిపారు. విద్యార్థులు ప్రయోగాత్మక విద్య ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

విరాళం అందించిన పెసరు శివకృష్ణను పాఠశాల ఉపాధ్యాయుల బృందం శాలువా కప్పి సన్మానించింది.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ననుబాల సోమక్క చంద్రమౌళి, మాజీ సర్పంచ్ పెసరు రమేష్, ప్రధానోపాధ్యాయురాలు ఫాతిమా మేరీ, వార్డు సభ్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .