తుమ్మనపల్లిలో ఘనంగా గ్రామ సభ.

తుమ్మనపల్లిలో ఘనంగా గ్రామ సభ.

*పింఛన్ల దరఖాస్తులకు ఈ నెల 18 వరకు అవకాశం – గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యలపై చర్చ*

హుజురాబాద్,ఆగష్టు 12(తెలంగాణ ముచ్చట్లు ):

హుజురాబాద్ మండలంలోని తుమ్మనపల్లి గ్రామంలో బుధవారం గ్రామ సభ నిర్వహించారు. గ్రామ పంచాయతీ సర్పంచ్ అన్నాడి మాధవి-రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యలపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి బుర్ర విజయ్ కుమార్ మాట్లాడుతూ గ్రామంలో కొత్తగా చేయూత పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే వితంతు, ఒంటరి మహిళలు, వికలాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు కొత్త ఫారంతో ఈ నెల పడ్డెనిమిదవ తేదీ వరకు గ్రామ పంచాయతీలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక , బాలల సమస్యలు, మహిళల సమస్యలు, రహదారుల అభివృద్ధి తదితర అంశాలపై గ్రామ ప్రజలతో చర్చించారు. గ్రామంలోని ఇతర సమస్యలను కూడా ప్రజలు సభ దృష్టికి తీసుకురాగా, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కాశీరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, ఉపాధి హామీ ఫీల్డ్ ఆఫీసర్ బానాల శ్రీనివాస్ రెడ్డి, బిల్ కలెక్టర్ కొండా అశోక్, కారోబార్ పొద్దూటూరి మధుకర్ రెడ్డి, గ్రామ యువజన నాయకుడు మిడిదొడ్డి రాజు, స్వయం సహాయక మహిళా సంఘాల నాయకురాళ్లు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.IMG-20260812-WA0034

Tags:

Post Your Comments

Comments

Latest News