చైతన్య యాత్ర ముగింపు సభను జయప్రదం చేయండి.

చైతన్య యాత్ర ముగింపు సభను జయప్రదం చేయండి.

-నగరంలో మూడు ప్రాంతాల నుంచి ప్రదర్శనలు

-భక్తరామదాసు కళాక్షేత్రంలో సభ

-హాజరుకానున్న కూనంనేని, బాగం

ఖమ్మం బ్యూరో, ఆగస్టు 11(తెలంగాణ ముచ్చట్లు )

భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) జాతీయ సమితి పిలుపులో భాగంగా జిల్లాలో జరిగిన ప్రజా చైతన్య యాత్ర ముగింపు సందర్భంగా ఈనెల 13న ఖమ్మంలో ముగింపు సభ జరుగుతుందని సిపిఐ నగర కార్యదర్శి ఎస్కె జానిమియా తెలిపారు. ఈ సందర్భంగా నగరంలో మూడు ప్రాంతాల నుంచి భారీ ప్రదర్శనలు నిర్వహించనున్నామన్నారు. మంగళవారం స్థానిక గిరిప్రసాద్ భవన్లో పగడాల మల్లేష్ అధ్యక్షతన జరిగిన -సమావేశంలో జానిమియా మాట్లాడుతూ కేంద్రంలో మోడీ అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ, మార్పును కాంక్షిస్తూ 20 మండలాల్లో చైతన్య యాత్రను నిర్వహించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా "ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా సభలు, సమావేశాలు నిర్వహించడం జరిగిందని జానిమియా తెలిపారు. ముగింపు సందర్బంగా ఖమ్మం రోటరీ నగర్, అల్లిపురం క్రాస్ రోడ్డు, -నయాబజార్ కళాశాల నుండి ప్రదర్శనలు ప్రారంభమవుతాయన్నారు. రోటరీ నగర్ నుండి ప్రారంభమయ్యే ప్రదర్శన మమత రోడ్డు, ఇల్లందు క్రాస్ రోడ్డు మీదుగా జెడ్పి సెంటర్కు చేరుకుంటుందని, అల్లిపురం క్రాస్ రోడ్డు -నుంచి ప్రారంభమయ్యే ప్రదర్శన ముస్తఫానగర్ మీదుగా జెడ్పి సెంటర్కు చేరుకుంటుందని, నయాబజార్ నుంచి ప్రారంభమైన ప్రదర్శన త్రీటౌన్ మీదుగా జెడ్పి సెంటర్కు చేరుకుంటుందని అక్కడి నుంచి మహా ప్రదర్శనగా భక్తరామదాసు కళాక్షేత్రంకు చేరుకుంటుందని జానిమియా తెలిపారు. అక్కడ సభ జరుగుతుందని తెలిపారు.

-సభకు హాజరు కానున్న కూనంనేని :

భక్తరామదాసు కళాక్షేత్రంలో జరిగే సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసన సభ్యులు కూనంనేని -సాంబశివరావు, జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి దండి సురేష్, సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్రెడ్డి తదితరులు పాల్గొంటారని జానిమియా తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర సమితి సభ్యులు మహ్మద్ సలాం, బిజి క్లెమెంట్, జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల శ్రీనివాసరావు, యానాలి సాంబశివరెడ్డి, ఏనుగు గాంధీ, నాయకులు వరదా నర్సింహారావు, సైదా, యాకూబ్, దుర్గానాథ్ పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

విద్యార్థిపై దాడి ఘటనపై బాలల హక్కుల కమిషన్ సీరియస్. విద్యార్థిపై దాడి ఘటనపై బాలల హక్కుల కమిషన్ సీరియస్.
దమ్మాయిగూడ, ఆగస్టు 11 (తెలంగాణ ముచ్చట్లు): మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా దమ్మాయిగూడలోని శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థిపై తోటి విద్యార్థులు దాడి చేసిన ఘటనపై తెలంగాణ బాలల హక్కుల...
కత్తితో యువకుడి హల్‌చల్.. కాలనీవాసుల్లో భయాందోళన.
మామిళ్లగూడెం నుంచి ఐసీఐసీఐ బ్యాంక్ డిప్యూటీ మేనేజర్‌గా అర్వపల్లి అఖిల నాగ రమ్య.
వందే భారత్ అవార్డుకు జర్నలిస్టు డాక్టర్ బండి కుమార్ ఎంపిక..
చైతన్య యాత్ర ముగింపు సభను జయప్రదం చేయండి.
నీళ్లు ఉన్నాయని వరి వేస్తే ఇబ్బందులే!
వరి పంటకే మద్దతు ధర, బోనస్ ఇస్తుంటే ఇతర పంటల వైపు ఎలా వెళ్లాలి ?