అక్షర జ్ఞాపకాలకు నివాళి..
కుటుంబానికి రూ.17 వేల ఆర్థిక చేయూత.
Views: 197
On
భీమదేవరపల్లి, ఆగస్టు 9 (తెలంగాణ ముచ్చట్లు):
భీమదేవరపల్లి మండలం మాణిక్యపూర్ గ్రామానికి చెందిన ఎలిగేటి ప్రవళిక–రమేష్ దంపతుల కుమార్తె అక్షర ఇటీవల మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ కష్ట సమయంలో ప్రవళికతో కలిసి చదువుకున్న శ్రీ సరస్వతి శిశు మందిర్ పూర్వ విద్యార్థులు మానవత్వాన్ని చాటుకున్నారు.అక్షర కుటుంబాన్ని పరామర్శించిన పూర్వ విద్యార్థులు రూ.17 వేల ఆర్థిక సహాయం అందించి కుటుంబానికి అండగా నిలిచారు. అనంతరం అక్షర చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
చదువుకున్న రోజుల జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, ఆపద సమయంలో కుటుంబానికి తోడుగా నిలవడం ద్వారా పూర్వ విద్యార్థులు తమ ఆత్మీయతను, మానవతా విలువలను చాటుకున్నారు. అక్షర కుటుంబానికి ఈ ఆర్థిక సహాయం కొంతమేరకు భరోసానిచ్చింది.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
09 Aug 2026 20:11:44
* ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజా సంఘాలతో కలిసి పోరాటం
* కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు వడ్లూరి కిషోర్
జమ్మికుంట టౌన్ ఆగస్టు 09 (తెలంగాణ...


Comments