వేలేరులో ప్రజాప్రతినిధులు–అధికారుల సమన్వయ, సమీక్ష సమావేశం.
వేలేరు ఆగస్టు 5(తెలంగాణ ముచ్చట్లు ):
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వేలేరు మండల కేంద్రంలో ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయ మరియు సమీక్ష సమావేశం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, వేలేరు మండల ప్రత్యేక అధికారి విజయ్ చందు అధ్యక్షతన నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో వేలేరు మండల తహసీల్దార్ కోమి, ఎంపీడీఓ కిషన్ నాయక్, వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బిల్లా యాదగిరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి విజయ్ చందు, తహసీల్దార్, ఎంపీడీఓ, సర్పంచ్ మాట్లాడుతూ మండల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహకారంతో వేలేరు మండలంలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు అవుతున్నాయని, ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రతి అర్హులైన లబ్ధిదారునికి చేరేలా అధికారులు, సర్పంచులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో సర్పంచులు అశోక్, అనిత, కిరణ్, శ్రీనివాస్, రమాదేవి, మానస, సాంబయ్యతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.


Comments