పరామర్శలతో ప్రజలకు అండగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.

పరామర్శలతో ప్రజలకు అండగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.

 బాధిత కుటుంబాలకు ఓదార్పు – ప్రతి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా

హుజురాబాద్,ఆగష్టు 2(తెలంగాణ ముచ్చట్లు ):

హుజురాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పలు పరామర్శ కార్యక్రమాల్లో పాల్గొని బాధిత కుటుంబాలకు అండగా నిలిచారు. ఇటీవల వివిధ కారణాలతో కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి ఇళ్లకు వెళ్లి మృతులకు నివాళులర్పించిన ఆయన, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బాధిత కుటుంబాల పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, వారి బాధలో తాము భాగస్వాములమని పేర్కొన్నారు. కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని సూచిస్తూ, అవసరమైన ప్రతి విషయంలో తమ సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉండటం ప్రజాప్రతినిధి బాధ్యత అని, నియోజకవర్గ ప్రజల సుఖదుఃఖాల్లో ఎల్లప్పుడూ భాగస్వామిగా ఉంటానని ఆయన తెలిపారు.
ఎమ్మెల్యే రాకతో బాధిత కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, అభిమానులు పరామర్శ కార్యక్రమాల్లో పాల్గొని మృతులకు నివాళులర్పించారు.
నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో వరుసగా పరామర్శ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిమానవీయ కోణాన్ని పలువురు అభినందించారు.IMG-20260802-WA0039

Tags:

Post Your Comments

Comments

Latest News

పరామర్శలతో ప్రజలకు అండగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. పరామర్శలతో ప్రజలకు అండగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.
  బాధిత కుటుంబాలకు ఓదార్పు – ప్రతి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా హుజురాబాద్,ఆగష్టు 2(తెలంగాణ ముచ్చట్లు ): హుజురాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
హుజురాబాద్ సభలో రావుల వేణుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కితాబు.
స్నేహ బంధానికి ప్రపంచం వందనం.
వేంసూరు టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం.
జర్నలిస్టులకు అండగా ఉంటా: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.
ఖమ్మం–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే అందుబాటులోకి.
భూ వివాదం ఉద్రిక్తం.. దంపతులపై దాడి జరిగిందని ఆరోపణ.