పామిడిరెడ్డిపల్లిలో ఓటరు దరఖాస్తుల ప్రక్రియ విజయవంతం.

పామిడిరెడ్డిపల్లిలో ఓటరు దరఖాస్తుల ప్రక్రియ విజయవంతం.

పెద్దమందడి,జూలై30(తెలంగాణ ముచ్చట్లు):

ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పామిడిరెడ్డిపల్లి గ్రామానికి సంబంధించిన ఓటరు దరఖాస్తులను బూత్‌వారీగా 100% శాతం పూర్తి చేసిన బి ఎల్ ఓలు, బి ఎల్ ఏ–2లను ఘనంగా సన్మానించారు.వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ పెద్దమందడి మండల అధ్యక్షులు కొమ్ము వెంకటస్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఓటరు దరఖాస్తులను నూరు శాతం డిజిటలీకరణ చేసేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.ఓటర్ల వివరాల నమోదు, దరఖాస్తుల పరిశీలన, డిజిటలీకరణ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడంలో బి ఎల్ ఓలు, బి ఎల్ ఏ–2లు కీలక పాత్ర పోషించారని కొమ్ము వెంకటస్వామి పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసేందుకు కృషి చేసిన వారందరినీ అభినందించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మధిర మంజుల–శ్రీశైలం, మాజీ ఎంపీటీసీ ఇంద్ర లక్ష్మారెడ్డి, బూత్ స్థాయి అధికారులు సునీత, లక్ష్మి, భాగ్యలక్ష్మి, శారద, బి ఎల్ ఏ–2లు కొంకలి నర్సింహా, వెంకటయ్య, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పామిడిరెడ్డిపల్లిలో ఓటరు దరఖాస్తుల ప్రక్రియ విజయవంతం. పామిడిరెడ్డిపల్లిలో ఓటరు దరఖాస్తుల ప్రక్రియ విజయవంతం.
పెద్దమందడి,జూలై30(తెలంగాణ ముచ్చట్లు): ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పామిడిరెడ్డిపల్లి గ్రామానికి సంబంధించిన ఓటరు దరఖాస్తులను బూత్‌వారీగా 100% శాతం పూర్తి చేసిన...
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.
పదోన్నతి ఉద్యోగులకు కొత్త ఉత్సాహం.
రైతులు నీటి నిల్వకుంటలు ఏర్పాటు చేసుకోవాలి.
ఎమ్మెల్యే రాగమయి ప్రత్యేక దృష్టి.. ఎస్‌ఐఆర్‌లో సత్తుపల్లికి గుర్తింపు.
వెల్టూర్ లో బీఎల్‌ఓల కృషి,ప్రజల సహకారంతో ఎస్‌ఐఆర్ ప్రక్రియ విజయవంతం.
కుదించిన ప్రింట్ మీడియా వార్త ఇలా ఉంటుంది: