బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు ఎన్నికైన ఉదయ్ నాగరాజుకు ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి సత్కారం.
Views: 0
On
* మన తెలంగాణ బిడ్డ కావడం పట్ల హర్షం
* భారత్–యూకే సంబంధాల బలోపేతంలో ఆయన సేవలు కీలకమని ప్రశంస
ఖమ్మం బ్యూరో, జులై 29(తెలంగాణ ముచ్చట్లు )
మన తెలంగాణ లోని కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రముఖ ప్రవాస భారతీయుడు, తొలిసారిగా బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు ఎన్నికైన ఉదయ్ నాగరాజుకు న్యూఢిల్లీలో బుధవారం నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి, తెలంగాణకు చెందిన పలువురు ఎంపీలతో కలిసి హాజరై.. శాలువతో సత్కరించారు. యూకే లో స్థానిక రాజకీయాల్లో క్షేత్రస్థాయి నుంచి ఎదిగి హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడిగా ఎన్నిక కావడం అభినందనీయమని కొనియాడారు.భారత్–యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య వివిధ రంగాల్లో సంబంధాల బలోపేతానికి ఉదయ్ నాగరాజు కృషి చేశారని, భవిష్యత్ లో మరింత సహకారం అందాలని ఆకాంక్షించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
29 Jul 2026 20:58:37
జమ్మికుంట రూరల్ జూలై 29 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట మండలంలోని అంకుశాపూర్ గ్రామంలో వ్యవసాయ పనులు చేస్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడటంతో ఓ రైతు మృతిచెందిన విషాద...


Comments