ఎల్‌నినో ప్రభావం ...ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు సిద్ధం కావాలి

. జిలెల్ల చిన్నారెడ్డి.

ఎల్‌నినో ప్రభావం ...ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు సిద్ధం కావాలి

వనపర్తి,జూలై25(తెలంగాణ ముచ్చట్లు): 

ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం తగ్గే అవకాశాలు ఉన్నందున రైతులు వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డా. జిలెల్ల చిన్నారెడ్డి సూచించారు.వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం జయన్న తిరుమలాపూర్ గ్రామంలో నిర్వహించిన రైతు గ్రామసభలో ఆయన మాట్లాడుతూ, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నీటి లభ్యత, పెట్టుబడి, మార్కెట్ అవకాశాల ఆధారంగా పంటలను ఎంపిక చేసుకోవాలని అన్నారు. పంట మార్పిడి, భూసార పరీక్షలు, వర్షపు నీటి సంరక్షణ, సూక్ష్మ నీటిపారుదల పద్ధతులను అనుసరించడం ద్వారా సాగు వ్యయం తగ్గి మంచి దిగుబడి సాధించవచ్చని తెలిపారు.వరి స్థానంలో కందులు, పప్పుధాన్యాలు, కూరగాయలు, ఉద్యాన పంటల సాగుపై దృష్టి పెట్టాలని, వ్యవసాయ అధికారుల సలహాలతో శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేపట్టాలని రైతులకు సూచించారు.జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ..జిల్లాలో కరవు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు ముందస్తుగా పంటల ప్రణాళిక రూపొందించుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

సూరారంలో పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి. సూరారంలో పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి.
ఎల్కతుర్తి, జూలై 25 (తెలంగాణ ముచ్చట్లు): హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని సూరారం గ్రామ శివారులో రిలయన్స్ గ్యాస్ ప్లాంట్ సమీపంలో కొత్తగా నిర్మిస్తున్న ఫంక్షన్ హాల్‌లో...
నీట్ బాధితులకు కొవ్వొత్తుల నివాళి.
సామాజిక న్యాయం కోసం బహుజన సేన పిలుపు .
శివారాధనతో పుణ్యమయమైన తొలి ఏకాదశి .
ఎల్‌నినో ప్రభావం ...ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు సిద్ధం కావాలి
ఓటరు జాబితా సవరణ వేగవంతం చేయాలి.
తొలి ఏకాదశికి శ్రీ వేంకటేశ్వరస్వామి సన్నిధిలో భక్తజన సందోహం.