బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకాలు.

బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకాలు.

పెద్దమందడి,జూలై22(తెలంగాణ ముచ్చట్లు):

బాలికల్లో భవిష్యత్తులో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్) ప్రమాదాన్ని తగ్గించేందుకు హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిల్లోమా వైరస్) వ్యాక్సిన్ ఎంతో ఉపయోగకరమని వైద్యులు తెలిపారు.బుధవారం పెద్దమందడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మదిగట్ల సబ్‌సెంటర్‌కు చెందిన జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 14 నుంచి 15 సంవత్సరాల వయస్సు గల బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ టీకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యులు డాక్టర్ మంజుల, డాక్టర్ సావని పాల్గొని వ్యాక్సిన్ ప్రాధాన్యంపై విద్యార్థినులు, ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు.హ్యూమన్ పాపిల్లోమా వైరస్ వల్ల కలిగే ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పించడంలో హెచ్‌పీవీ వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తుందని, ముఖ్యంగా భవిష్యత్తులో సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలను గణనీయంగా తగ్గిస్తుందని వైద్యులు వివరించారు. చిన్న వయస్సులోనే ఈ టీకా తీసుకోవడం ద్వారా మెరుగైన రోగనిరోధక శక్తి ఏర్పడుతుందని తెలిపారు.హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై తల్లిదండ్రులు ఎలాంటి అపోహలు, భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, ఇది సురక్షితమైన టీకా అని వైద్యులు స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి బాలికకు ఈ వ్యాక్సిన్ వేయించి వారి ఆరోగ్య పరిరక్షణకు సహకరించాలని తల్లిదండ్రులను కోరారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండలంలోని అర్హులైన బాలికలందరికీ దశలవారీగా హెచ్‌పీవీ టీకాలు అందించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలోIMG-20260722-WA0026 పీహెచ్‌సీ సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వరప్రసాద్ రావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News