ఉపాధ్యాయుల సమస్యల సాధనకు ఆగస్టు ఒకటిన మహాధర్నా.

పోస్టర్ ఆవిష్కరించిన మండల విద్యాధికారి మంజులత .

ఉపాధ్యాయుల సమస్యల సాధనకు ఆగస్టు ఒకటిన మహాధర్నా.

పెద్దమందడి,జూలై22(తెలంగాణ ముచ్చట్లు):

తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం పిలుపు మేరకు ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు ఒకటిన నిర్వహించనున్న మహాధర్నాకు సంబంధించిన పోస్టర్‌ను బుధవారం పెద్దమందడి మండలంలోని బలిజేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల విద్యాధికారి మంజులత చేతుల మీదుగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శశివర్ధన్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులను మానసిక ఆవేదనకు గురిచేస్తున్న సమస్యలు వెంటనే పరిష్కారం కావాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసం సంఘాలకతీతంగా ప్రతి ఉద్యోగి, ఉపాధ్యాయుడు మహాధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఐక్యతతో ఉద్యమించినప్పుడే న్యాయమైన డిమాండ్లు పరిష్కారమవుతాయని పేర్కొన్నారు.రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వరప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల ఆర్థిక, సేవా సంబంధిత సమస్యల పరిష్కారం కోసం చేపడుతున్న ఈ మహాధర్నాకు అన్ని ఉపాధ్యాయ సంఘాలు సంఘీభావం ప్రకటించి విజయవంతం చేయాలని కోరారు. ఉపాధ్యాయుల హక్కుల సాధనలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని ఆయన అన్నారు.మండల విద్యాధికారి మంజులత మాట్లాడుతూ, ఉపాధ్యాయులు విద్యా ప్రమాణాల పెంపుతో పాటు తమ సమస్యలను ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం కూడా అవసరమేనని అన్నారు.ఈ కార్యక్రమంలో సంఘం సీనియర్ సభ్యుడు భాస్కర్, పెద్దమందడి మండల శాఖ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, సంఘం ప్రాథమిక సభ్యులు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయినులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News