ఉపాధ్యాయ వృత్తికి ఆదర్శంగా చల్లా శివయ్య సేవలు.

ఉపాధ్యాయ వృత్తికి ఆదర్శంగా చల్లా శివయ్య సేవలు.

వనపర్తి,జూలై21(తెలంగాణ ముచ్చట్లు): 

జిల్లా విద్యాశాఖలో 37 సంవత్సరాల పాటు సేవలందించి ఇటీవల ప్రధానోపాధ్యాయుడిగా పదవీ విరమణ చేసిన చల్లా శివయ్యను మంగళవారం వనపర్తి పట్టణంలోని ఆయన నివాసంలో ఘనంగా సన్మానించారు. సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో శాలువా, జ్ఞాపికతో ఆయనను సత్కరించారు.ఈ సందర్భంగా పలుస శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. గణితశాస్త్ర ఉపాధ్యాయుడిగా వేలాది మంది విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించడంతో పాటు, ప్రధానోపాధ్యాయుడిగా పాఠశాలల అభివృద్ధికి విశేష కృషి చేశారని కొనియాడారు. 37 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ జీవితంలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు సైతం మార్గదర్శకుడిగా నిలిచి, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల ప్రశంసలు అందుకున్నారని తెలిపారు. ఆయన సేవలు భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.కార్యక్రమంలో పానగల్లు ఎంఈఓ ఆనంద్, పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు బౌద్ధరెడ్డి, సాహితీ కళా వేదిక ప్రతినిధులు బైరోజు చంద్రశేఖర్, దేశి రాములు యాదవ్, గంధం నాగరాజు, డా. బి. శ్యాంసుందర్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News